సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్.. ఆర్సీబీపై ఎల్ఎస్జీ విజయం

Publish Date:May 7, 2026

Advertisement

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో  లక్నో సూపర్ జెయింట్స్ జట్టు  విజయం సాధించింది. లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ కళ్ళు చెదిరే సెంచరీతో ఆకాశమే హద్దుగా విరుచుకుపడటంతో బెంగళూరు  చేతులెత్తేసింది.  ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న లక్నో, ఈ విజయంతో  తన ప్లేఆప్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది.  మిచెల్ మార్ష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఆర్సీబీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన మార్ష్  కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతనికి నికోలస్ పూరన్ 38 పరుగులు జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టు స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. నిర్ణీత 19 ఓవర్లలో లక్నో  3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.  వర్షం కారణంగా ఆర్సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జాకబ్ బెథెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా మిడిల్, ఆఫ్ స్టంప్‌లను గిరాటేయడంతో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 2023 ఏప్రిల్ తర్వాత ఐపీఎల్‌లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి.

9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్  61 పరుగులు, దేవదత్ పడిక్కల్ 34 పరుగులూ ఆదుకున్నారు.  ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. పడిక్కల్‌ను కూడా తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి ఔట్ చేసిన ప్రిన్స్..  ఆ తర్వాత జితేశ్ శర్మను కూడా పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే పాటిదార్ కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ పతనం మొదలైంది. చివర్లో కృనాల్ పాండ్య (28 నాటౌట్‌), రొమారియో షెపర్డ్ (23 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా, దిగ్వేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోకు విజయాన్ని అందించాడు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.