ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు

Publish Date:Sep 24, 2025

Advertisement

 

తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కూతురుపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు కారులో వచ్చి కూతురిని కిడ్నాప్ చేసి తీసు కువెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని నర్సంపల్లి గ్రామంలో నివాస ముంటున్న శ్వేత అనే యువతి, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువ కుడ్ని ప్రేమించింది. కానీ వీరి ప్రేమను శ్వేత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమ జంట పెద్దల్ని ఎదిరించి గత నాలుగు నెలల క్రితం పెళ్లి  చేసుకున్నారు. 

కూతురు తమకు నచ్చని వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు కోపంతో రగిలిపో యారు. ఎలాగైనా సరే తన కూతుర్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు బుధవారం తెల్లవారుజామున శ్వేత తల్లిదండ్రులు వారి బంధువుల సహాయంతో కూతురు అత్తవా రింటికి వెళ్లి ప్రవీణ్ పై దాడి చేయడమే కాకుండా శ్వేత కళ్ళులో కారం చల్లి... కండ్లకు బట్టకట్టి కొట్టు కుంటూ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసు కెళ్లారు. 

అయితే ఈ ఘటనకు సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి.. అనంతరం ప్రవీణ్ తన భార్యను కిడ్నాప్ చేశారని కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

By
en-us Political News

  
ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు.
మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో  దశాబ్దాల  అనుభవం ఉంది. 1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన  కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు.
ఈ ప్రక్రియకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ 42 మంది అధికారులు ఉన్నత హోదాలలో బాధ్యతలు చేపట్టనున్నారు.
గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం ఒక పవిత్ర ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అపారమైన నమ్మకాన్ని, 56 శాతం భారీ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని సువేరా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, గెలుపే పరమావధిగా భావించి ఎలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు, గాలివాటంగా వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడమేనని ఆయన విశ్లేషించారు.
బ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ పనులు చేపట్టారు.
నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్‌లో 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం, మృతుల వివరాలు మరియు తాజా పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం.
గతంలో చట్ట సభల్లో ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ Oracle ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు ఆటోమేషన్ కారణంగా భారతీయ ఐటీ రంగం, ఫ్రెషర్స్ మరియు మిడ్లె వల్ మేనేజర్లపై పడనున్న ప్రభావం, మరియు మీ కెరీర్ కాపాడుకోవడానికి అవసరమైన టాప్ AI స్కిల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది.
2026 జూన్ 25 లేదా 26 తేదీలలో మొహర్రం బ్యాంక్ సెలవు ఎప్పుడు? హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు ఎందుకు మూతపడనున్నాయో ఆర్‌బీఐ (RBI) అధికారిక సెలవుల జాబితా ద్వారా ఇప్పుడే తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.