బండి భగీరథ్‌కు లుకౌట్‌ నోటీసులు... పోలీసుల ముమ్మర తనిఖీలు

Publish Date:May 16, 2026

Advertisement

 

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదై ఉండగా, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 8న నమోదైన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ, కేసు తీవ్రతను బట్టి పోలీసులు తర్వాత తీవ్రమైన శిక్షలకు ఆస్కారమున్న అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ (పోక్సో సెక్షన్ 5(l) r/w 6) సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార పక్షాలు, ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చట్టం ముందు ఎవరూ చుట్టాలు కారని, ఎంతటి వారైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూకట్‌పల్లి డీసీపీ రిత్రిరాజ్ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం బాధితురాలి నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఫామ్‌హౌస్ వివరాలు, అపార్ట్‌మెంట్ రికార్డులు మరియు నిందితుడి మొబైల్ లొకేషన్ డేటా వంటి కీలక సాక్ష్యాలను సేకరిస్తోంది. అలాగే బాధితురాలి వయస్సును నిర్ధారించడానికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి బర్త్ సర్టిఫికేట్ రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ గడువులోగా స్పందించకపోవడంతో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆయన కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఢిల్లీ మరియు కరీంనగర్‌కు పంపించారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల మరియు నోటీసులు చాలా తక్కువ సమయంలో ఇవ్వడం వల్ల తాను విచారణకు రాలేకపోతున్నానని, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడానికి రెండు రోజుల సమయం కావాలని కోరుతూ భగీరథ్ పేట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు సోషల్ మీడియా ద్వారా ఒక లేఖను పంపినట్లు తెలుస్తోంది. 

ఇదే సమయంలో కరీంనగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భగీరథ్ ఫోటోలతో కూడిన 'అబ్స్కాండింగ్' పోస్టర్లు వెలియడం తీవ్ర కలకలం రేపింది. ఈ పోస్టర్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 

బాధితురాలి వయస్సు 19 నుండి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని, గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాద కేసు రికార్డుల ప్రకారం ఆమె మైనర్ కాదని హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. బాలిక వయస్సును కావాలనే తగ్గించి పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేశారని రికార్డులను సమర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హైకోర్టు తీర్పు మరియు పోలీసుల తదుపరి చర్యలపైనే ఈ హైప్రొఫైల్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణ అంతటా ఈ కేసు పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
 

By
en-us Political News

  
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది.
ఉప్పల్‌కు చెందిన సంతోష్ రెడ్డి ఆమెకు క్లాస్‌మేట్‌గా ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో మొదట స్నేహితుడిగా దగ్గరయ్యాడని, అనంతరం ప్రేమ పేరుతో నమ్మించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భారీగా ఆస్తులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నానని చెప్పి తనను నమ్మించాడని తెలిపింది. నువ్వు లేని జీవితం నాకు వద్దు అంటూ ప్రేమ మాటలతో ఒప్పించి ఇండియాకు రప్పించి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. ఇరు కుటుంబాల సమక్షంలో 2014లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగినట్లు తెలిపింది.
ఈ హత్య వెనుక భూ వివాదాల కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ భూముల వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మలక్‌పేట్ ప్రాంతంలోని భూ వివాదాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించిన అంశాల్లో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో అడ్వకేట్ కాజా మొయినుద్దీన్‌కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంతోనే అబ్బుర పరుస్తున్నాడు.
నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. బాధితులు శిఖరం నుంచి కిందకు దిగుతుండగా తీవ్ర అలసటతో అస్వస్థతకు గురయ్యారు. వారిని రక్షించేందుకు గైడ్స్‌ తీవ్రంగా ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. మృతులను భారత్‌కు చెందిన అరుణ్‌ కుమార్‌ తివారీ, సందీప్‌ ఆరేగా గుర్తించారు.
పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకంగా రోమియో జూలియట్ క్లాజ్ తీసుకు రావాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
కొన్ని రోజులుగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్టులు, అవమానకర కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. గౌరవాన్ని కించప రిచేలా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.