దీర్ఘ మేర ఆరోగ్య మ(శి)స్తు!!

Publish Date:Dec 20, 2021

Advertisement

జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే సంపాదించుకున్నది అంతా మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదన  మొత్తం హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు శిస్తు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పట్లో రోగం లేని మనిషి అంటూ లేడు. బీపీలను, షుగర్లను వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు మనుషులు. ఒకప్పుడు జబ్బులనేవి తక్కువ. నిజానికి జీవితం ఖరీదు అవుతుంటే జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో సమకూర్చుకోవలసి వస్తుంది. అందుకే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్య సమస్యలు అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉన్నాయి. 

 ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి?? 

గత యాభై సంవత్సరాలు ఇంకా కనీసం పది, ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే జనాబాకు జబ్బుల దాడి ఎక్కువయ్యింది. అదేనండి సమస్యలు ఎక్కువ అయ్యాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే వ్యవసాయ పంటలలో  పోషణ తగ్గింది. పెద్దలు చెబుతూ ఉంటారు ఒకప్పుడు గింజలు, విత్తనాల రుచి వేరు అని. అది నిజమే కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం నుండి పురుగుమందులు ఉపయోగించి పంటలు పండించడం వల్ల రుచి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఇది కాకుండా మరొకటి ఉంది. అదే పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం. 

పొరుగింటి పుల్లకూర రుచి!!

ఓకేప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేరకమైన వాతావరణంలో ఉంటారు. పొరుగింటి పుల్లకూర తిన్నా పర్లేదు ఏమీ కాదు. విదేశాలు పూర్తిగా భారతదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడ పండే పంటలు వారు తింటారు. అయితే అవి తెచ్చి ఇక్కడ తినడం వల్ల వస్తున్నవే ఆరోగ్య సమస్యలు. వారు అక్కడ వాడే పదార్థాలు వారికి దొరికే స్వఛ్చమైనవి అయి ఉండచ్చు, కానీ అవి ఇక్కడికి పచ్చేసరికి  50% పైగా కలుషితం అవుతాయి. వాటి మీద లేబుల్స్ మెరుస్తూ, మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు అతికిస్తూ విదేశీ ఫుడ్ ఎంతగానో జనాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్యాకింగ్ ఫుడ్స్ ను ఇన్స్టంట్ ఫుడ్స్ ను పరిచయం చేసింది విదేశీ వ్యాపారాలే. నిజానికి విదేశాలలో కూడా జీర్ణసంబంధ సమస్యలు, పేగు క్యాన్సర్లు ఎక్కువ. కారణం వారు తినే ఆహారం, వారి అలవాట్లు కూడా. 

అవసరాలు, ఆహారం అయ్యో!! అయ్యో!!

చాలా ఇళ్లలో ఆహారం విషయంలో అయినా నిర్లక్ష్యం చేస్తారు కానీ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు. నిజానికి ప్రతి కుటుంబంలో ఆహార ఆవశ్యకత గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. ఏ రోగమో, రొప్పో వచ్చినప్పుడు మందులతో ఆ రోగానికి  టెంపరరీ సొల్యూషన్స్ వెతుక్కోవడం, శరీర సామర్థాన్ని  రోజు రోజుకూ దిగజార్చుకోవడం, అలా ఆరోగ్యాన్ని ఖూనీ చేసుకునే లెజెండ్స్ ఎక్కువయ్యారని చెప్పచ్చు. మన భారతదేశానికి మహర్షులు ప్రసాదించిన ఆయుర్వేదాన్ని కాదని చిటికెలో తలనొప్పులు, గొంతు గరగరలు తగ్గించే ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడి జీవితకాలన్ని తగ్గించుకుంటున్నారు. 

అందుకే జీవితంలో సంపాదించే దానిలో మొదట ఆహారం కోసం ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పటి కాలంలో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆయుర్వేదంలో సూచించబడిన ఎన్నో అద్భుత మొక్కలను రోజువారీ సమస్యలలో ఉపయోగించవచ్చు. పలితం శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.  లేదూ సరిపడని తిండి, వ్యతిరేకమైన అలవాట్లు ఫాలో అవుతామని అంటే అలాగే కానివ్వండి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోల్పోయి దానికి శిస్తు కడుతూ శిక్ష అనుభవిస్తారు తప్పనిసరిగా!!


◆ వెంకటేష్ పువ్వాడ


 

By
en-us Political News

  
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.