LATEST NEWS
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మానవత్వాన్ని మంటగలిపే ఘటనలు నిత్యం వెలుగుచూస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి కిరాతకాలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. అసలు నేటి యువతలో ఇంతటి క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? హింసను సాధారణంగా భావించే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రాంగణంలోనే జరిగిన కిరాతక దాడి అందరినీ నివ్వెరపరిచింది. తోటి విద్యార్థుల కళ్లెదుటే రంపంతో దాడికి పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఓ విద్యార్థినిపై ఇంతటి అమానుషంగా దాడి చేయడానికి మనసు ఎలా ఒప్పిందనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో సినిమాల్లో పెరిగిపోతున్న హింసాత్మక దృశ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల విడుదలైన కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో రంపంతో దాడి చేసే హింసాత్మక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. వెండితెరపై చూపించే ఇలాంటి సన్నివేశాలు యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కత్తులతో నరకడం, రంపాలతో దాడి చేయడం, తలలు నరికేయడం, విచక్షణారహితంగా హత్యలు చేయడం వంటి భయానక దృశ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. హీరోయిజం పేరుతో హింసను గొప్పగా చూపించడం, క్రూరమైన చర్యలను స్టైలిష్‌గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, సమాజంలో జరిగే ప్రతి నేరానికీ సినిమాలే కారణమని చెప్పలేం. వ్యక్తుల పెంపకం, మానసిక పరిస్థితులు, సామాజిక వాతావరణం, ఇతర ప్రభావాలు కూడా నేరప్రవృత్తికి కారణం కావచ్చు. కానీ తెరపై చూపించే హింసాత్మక సన్నివేశాలు కొందరు యువతపై ప్రభావం చూపే అవకాశాన్ని మాత్రం విస్మరించలేం. ముఖ్యంగా విచక్షణ పెరగాల్సిన వయసులో హింసను అనుకరించే ప్రమాదం ఉందనే ఆందోళన సహజమే. అందుకే చిత్ర పరిశ్రమ పెద్దలు, దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు ఈ అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వినోదం పేరుతో హింసను మహిమపరచడం కాకుండా, మానవీయ విలువలు, కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు.. కోట్లాది మందిపై ప్రభావం చూపగల శక్తివంతమైన మాధ్యమం. హీరోలను అభిమానించే యువత వారి నటనతో పాటు వారి ఆలోచనలను, సందేశాలను కూడా స్వీకరిస్తుంది. అలాంటప్పుడు సమాజం పట్ల బాధ్యతతో కూడిన కథలను అందించడం సినీ ప్రముఖుల బాధ్యత. తెరపై హీరోయిజం అంటే విలన్లను చంపడం మాత్రమే కాదు.. సమాజానికి మంచి మార్గం చూపించడం కూడా! హింసను ప్రేరేపించే సన్నివేశాల కంటే మానవత్వాన్ని మేల్కొలిపే కథలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే వెండితెర వినోదంతో పాటు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.       [ Cinema Violence, Movie Impact on Youth, Toxic Movie, Yash, Violence in Films, Youth Crime, Rising Crimes, Rapthadu Incident, Student Attack, Social Responsibility, Film Industry, Violent Scenes, Youth Behaviour, Crime Prevention, Human Values, Telugu States ]
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.? కడప జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. నామినేషన్ల దశ నుంచే రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో.. పోలింగ్‌ రోజున ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు పరస్పరం సవాళ్లు విసురుకుంటుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుందా? ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతున్న పోరులో సాధారణ ఓటరు ఇబ్బందులు పడకుండా చూడటం అధికార యంత్రాంగానికి కీలకంగా మారింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంతోపాటు, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తేనే ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగుతుంది. కీలక ఘట్టం.. నేడే పోలింగ్‌.! నెలల తరబడి సాగిన రాజకీయ వ్యూహాలు, ప్రచారాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఆదివారం ఓటర్లు తమ తీర్పుతో సమాధానం చెప్పనున్నారు. కడప నగరపాలక సంస్థతోపాటు బద్వేల్‌, ఎర్రగుంట్ల, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. జిల్లావ్యాప్తంగా 4,39,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో పోలింగ్‌ శాతంపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. పులివెందులలో టెన్షన్‌.. టెన్షన్‌.! జిల్లాలో అందరి దృష్టి పులివెందులపై కేంద్రీకృతమైంది. వైఎస్‌ జగన్‌ పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, నేతల పరస్పర సవాళ్ల నేపథ్యంలో పోలింగ్‌ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రత్యర్థి పార్టీల నేతలు తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో సుమారు 750 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఏఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. రాజకీయ శ్రేణుల మోహరింపు.. పోలీసులకు సవాల్‌.! ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, అనుచరులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లను సమన్వయం చేసుకోవడం, ప్రత్యర్థి వర్గాల కదలికలను గమనించడం వంటి పరిణామాలతో చివరి నిమిషం వరకు రాజకీయ వాతావరణం వేడిగా మారింది. అయితే, ఈ మోహరింపు పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులు, వాగ్వాదాలు, ఘర్షణలకు దారితీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం కీలకంగా మారింది. ఓటు వేయగలమా? ఓటర్లలో సందేహాలు.! స్థానిక రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో కొందరు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలమా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, భయాందోళనలకు తావులేకుండా పోలింగ్‌ జరిగేలా చూడటం అధికారులకు ప్రధాన బాధ్యతగా మారింది. 560 పోలింగ్‌ కేంద్రాలు.. పటిష్ట భద్రత.! జిల్లావ్యాప్తంగా 272 ప్రాంతాల్లో మొత్తం 560 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 155 అత్యంత సమస్యాత్మక, 180 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అలాగే, 335 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, 138 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 3,864 మంది పోలింగ్‌ సిబ్బందితోపాటు 208 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ప్రతి ఓటూ కీలకమే.! పులివెందులలో రాజకీయ పోరు తీవ్రంగా ఉండటంతోపాటు జమ్మలమడుగు, కడప ప్రాంతాల్లోనూ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా ముగించడం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఎక్కడా ఘర్షణలకు తావులేకుండా, ప్రతి ఓటరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భయాందోళనలు వద్దు.. స్వేచ్ఛగా ఓటేయండి.! ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్‌ 1న బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమయ్యే ప్రజా తీర్పు నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపుతో వెల్లడికానుంది. దీంతో కడప జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.       [ Kadapa Municipal Elections, AP Municipal Polls, Kadapa Elections 2026, Pulivendula Elections, YS Jagan Mohan Reddy, Jammalamadugu Elections, Kadapa Political Tension, Andhra Pradesh Politics, Municipal Polling, Election Security, Police Deployment, Sensitive Polling Stations, Voter Safety ]  
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కలకలం రేపిన ఒక ఘటనలో, పేరుకు లేడీస్ హాస్టల్ ముసుగులో సాగుతున్న భారీ అండాల అక్రమ దందా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన బేగంపేట ప్రకాశ్‌నగర్ పరిధిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బేగంపేట పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అర్థరాత్రి సమయంలో నిర్వహించిన ఈ సోదాల్లో అక్కడ నివసిస్తున్న సుమారు 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  ప్రాథమిక విచారణలో పట్టుబడిన వారంతా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులుగా గుర్తించారు. గత ఏడాది కాలంగా ప్రకాశ్‌నగర్‌లోని ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో ఈ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు స్థానికులు  పోలీసుల ద్వారా తెలుస్తోంది. పేదరికంలో మగ్గుతున్న యువతులను టార్గెట్ చేస్తూ, వారికి మాయమాటలు చెప్పి ఈ అక్రమ రనాలోకి లాగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఒక్కో యువతికి సుమారు రూ. 30,000 వరకు నగదు ఆశ చూపి, వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసి నిబంధనలకు విరుద్ధంగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందాను నడిపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.  కనీస వైద్య సదుపాయాలు లేని సాధారణ అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి సంక్లిష్టమైన వైద్య ప్రక్రియలను నిర్వహించడం పట్ల నిపుణులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతిలో సేకరించిన అండాలను (Eggs), సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు చికిత్స అందించే నగరంలోని ప్రముఖ ఫెర్టిలిటీ (Fertility) కేంద్రాలకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం మహిళల అండాలే కాకుండా, పురుషుల వీర్యకణాలను (Sperm) కూడా అక్రమంగా సేకరించి సరఫరా చేస్తున్నారనే మరో కోణంలోనూ పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం రాకెట్ వెనుక ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దందా వెనుక ఏయే సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధాలున్నాయి, దీని వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో బేగంపేట పోలీసులు తదితర బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి       [  hyderabad egg donation racket, begumpet police raid, illegal fertility scam, sot raid hyderabad, ivf egg trade scandal, girls hostel illegal activities, Hyderabad police, CP Sajjnar, DGP C.V. Anand ]
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా కరెంట్ ప్రసరించడంతో ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో పర్యాటక వర్గాలు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్‌గా పేరున్న ప్రాంగణంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతి చెందిన వారిని జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ (57), స్లోవేకియా దేశానికి చెందిన జురాజ్ హోర్వాత్ (45)గా గుర్తించారు. వీరిలో ఒకరు విమానయాన సిబ్బందిగా పనిచేస్తుండగా, మరొకరు ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.     సాయంత్రం సమయంలో హోటల్ మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో నీటిలో విద్యుత్ లీకై ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. వారిద్దరూ నీటిలోనే స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన మరో అమెరికన్ పర్యాచకుడు  హోటల్ సిబ్బంది అయిన లైఫ్‌గార్డ్ వారిని రక్షించేందుకు సాహసోపేత ప్రయత్నం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో వారికి కూడా స్వల్పంగా విద్యుత్ షాక్ తగలడంతో పాటు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికి విదేశీయులు ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. రక్షణ చర్యల్లో గాయపడిన అమెరికా పర్యాచకుడు మరియు పూల్ అటెండర్ ప్రాణాపాయం నుండి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. హోటల్ యాజమాన్యం మరియు నిర్వహణ సిబ్బంది చేసిన తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమనే కోణంలో ఆరా తీస్తున్నారు. విద్యుత్ వైరింగ్ లోపాలు లేదా నీటి మోటార్ల లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధానులలో ఒకైన బెంగళూరులోని అంతర్జాతీయ స్థాయి హోటళ్లలో ఇటువంటి భద్రతా లోపాలు వెలుగుచూడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకుల భద్రతపై నీలీనీడలు కమ్ముకోవడంతో, హోటల్స్  రిసార్ట్‌ల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి.       [ Bengaluru hotel electrocution, Conrad hotel pool accident, foreign nationals die in India, Bangalore news, swimming pool electric shock ]  
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, మరో తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా బలపడే అవకాశాలున్నాయని, నవంబర్ 2, 3, 4 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.  సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సోసైటీ నుంచి రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అర్నబ్ తుపాను విధ్వంసం అనంతరం చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రసుత్తం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనాన్ని ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్ రాడార్ల ద్వారా ప్రతి ఆరు గంటలకు ఓసారి అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా గుర్తించి తగిన ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.  మొబైల్ నెట్వర్క్‌కు అంతరాయం లేకుండా ప్రణాళిక.! విద్యుత్ అంతరాయం ఏర్పడినా మొబైల్ నెట్‌వర్క్ పనిచేసేలా అన్ని మండల కేంద్రాల్లో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని బీఎస్ఎన్ఎల్ 4,500 టవర్లతో పాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు నిరంతర విద్యుత్ అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 7 వేల మంది సిబ్బంది, 400 యంత్రాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.  వీటిని వేగంగా పూర్తి చేసి అన్ని గృహాలకు విద్యుత్ సరఫరా అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను సమయంలో  దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. కాకినాడ వద్ద ప్రొటెక్షన్ వాల్‌ను పునరుద్ధరించాలన్నారు. నరసాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో కాలువల పూడిక తొలగించాలని సూచించారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నీరు దిగువ ప్రాంతాలకు సజావుగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. భవిష్యత్తులో రోడ్లు, కాలువలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక ఎస్ఓపీ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి రైతుకూ పంటల బీమా భరోసా.! ప్రకృతి విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్ నుంచి ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 47 లక్షల మంది రైతులకు చేరువయ్యేందుకు యాప్‌ను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం కల్పించాలని చెప్పారు. సాంకేతికతను వినియోగిస్తున్న చాంపియన్ రైతులను గుర్తించాలని సూచించారు.  అర్నబ్ తుపాను వల్ల కొబ్బరి, అరటి పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కొబ్బరి పంట దెబ్బతిన్న 1,293 హెక్టార్లకు హెక్టారుకు రూ.54 వేల చొప్పున, నేల కొరిగిన, తలలు దెబ్బతిన్న ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. సుమారు 1.95 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. అలాగే 15 వేల హెక్టార్లలో దెబ్బతిన్న అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విద్యుత్, విపత్తుల నిర్వహణ శాఖల ఉన్నతాధికారులు, వివిధ టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.       [ Andhra Pradesh Cyclone Alert, CM Chandrababu, AP Weather Update, New Cyclone Threat, Bay of Bengal Depression, Cyclone Warning, AP Government, CM Chandrababu Review, Cyclone Preparedness, Heavy Rainfall Alert, South Coastal Andhra, Rayalaseema, Arnab Cyclone Damage, Disaster Management, RTGS, Mobile Network Connectivity ] 
ALSO ON TELUGUONE N E W S
Scene starring Suriya, Nazriya Nazim and Naslen has become talk of the town after Naslen is confirmed to play an antagonist. The young actor has built a huge reputation across Telugu movie lovers at least on social media with his films. Mainly, Mollywood Times has helped him create such good impression and fan following. Now, Scene seems to increase it to next level. The trailer of the film has been released now and interestingly, Naslen's portions excite more than Suriya. As ACP Inbaraj, he has very casual character and director Jithu Mathavan, has cracked many jokes on his famous characters and scenes from before, keeping them as meta references but with a difference. But the major highlight remains to be Naslen and his antagonist role. His scenes, frames and interaction with Suriya rise anticipation to watch them go head-to-head in this cat and mouse game of between an egoistic police officer and a cold-blooded serial killer.  Nazriya Nazim scenes do not really excite much but the film looks like a dark comedy with all thriller troupes. Movie is releasing on 6th November for Diwali and many are expecting it to be hat-trick hit for Suriya this year. Let's see how Jithu's magic will work at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
The sensational combination of Ram Charan and Sukumar is back! Eight years after delivering the cult blockbuster Rangasthalam, the actor-director duo is reuniting for RC17, bringing back the successful trio with producers Mythri Movie Makers. The film will have a grand launch with a pooja ceremony tomorrow. Following the pan-India success of Pushpa 2, the director is taking considerable time to shape this ambitious project. The makers have also established a dedicated office and are currently working on the final stages of pre-production. Ram Charan will undergo massive transformation for this film.  The makers are keeping the genre, cast and technical crew details under wraps for now. With Rangasthalam remaining a landmark collaboration in both their careers, expectations are naturally high for their reunion. Sukumar Writings will co-produce the film with Mythri.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల తేదీ, సమయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం నవంబర్ 1, 2026న ఉదయం 10:50 గంటలకు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, T Films సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాయి. ‘మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్’ అంటూ పోస్టర్‌పై పేర్కొనడం, ‘You Can Imagine’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూజా కార్యక్రమం సందర్భంగా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘రంగస్థలం’తో రామ్ చరణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన సుకుమార్.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి సుకుమార్ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తారో చూడాలి.     [Ram Charan, Sukumar, RC17, Ram Charan Sukumar Movie, RC17 Pooja Ceremony, Mythri Movie Makers, Sukumar Writings, Ram Charan Upcoming Movie]
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంతో పాటు, సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్న అంశంపై అధికారులు వివరణ కోరారు. బాలల హక్కులు, భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. షూటింగ్‌లో బాలికను పాల్గొనేలా చేయడానికి ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? ఆమె తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అనే ప్రశ్నలను నిర్మాతల ముందు ఉంచారు. అలాగే బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో ఆమె పనిచేసిన గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ కారణంగా బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలేమిటి? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా? అనే వివరాలను కూడా అధికారులు అడిగారు. బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె పాల్గొనే విషయంలో నిబంధనలు పాటించారా? అన్న అంశాలపైనా వివరణ కోరారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నిర్మాతలను కార్మిక శాఖ ఆదేశించింది. దీంతో ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే నోటీసులు జారీ కావడం మాత్రమే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కాదు. నిర్మాతలు సమర్పించే వివరణ, విచారణ అనంతరం అధికారులు తీసుకునే నిర్ణయంతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.     [Ravi Teja, Irmudi Movie, Irmudi Movie Controversy, Telangana Labour Department, Minor Girl Shooting, Irmudi Producers Notice, Child Artist Rules, Ravi Teja Latest News]
The Telangana Labour Minister Vivek, has issued notices to the producers of Ravi Teja's upcoming film Irumudi, Mythri Movie Makers, over the participation of a minor girl, Baby Nakshatra, in the film's shoot. The department has sought clarification on whether the production team followed the mandatory regulations governing the employment of children in film productions. The Joint Commissioner of the Telangana Labour Department has questioned Mythri on whether they obtained prior permission from the District Magistrate before involving the minor in the shoot and secured formal consent from her parents. The officials have also sought call sheets, attendance records and details of the working hours during which the girl participated in filming. The production team has been asked to explain what measures were taken to ensure that her education was not affected, whether a dedicated guardian was appointed to look after her safety and welfare, and whether 20 per cent of her remuneration was deposited in a fixed deposit account. The department has also sought clarification on the minor's proposed participation in the film's promotional activities, including its pre-release event. The producers have been directed to appear before the Labour Department on November 4 at 11 AM with all relevant documents and evidence. The notice seeks to establish whether the film's production complied with child labour regulations and safeguards applicable to minors working in the entertainment industry. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
1980ల నేపథ్యంలో సాగే ఈ కథకు ‘పేర్నూరు’ అనే కల్పిత ప్రాంతం వేదిక. అక్కడ తరతరాలుగా మహిళలే అధికారాన్ని, వ్యాపారాలను తమ చేతుల్లో ఉంచుకుంటారు. ఈ వ్యవస్థలో భవానీ (కీర్తి సురేష్) ఒక కీలకమైన నాయకురాలు. తన కుటుంబ వారసత్వాన్ని, తమ ప్రాంతంపై ఉన్న ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే ఆమె లక్ష్యం. అలాంటి సమయంలో ముంబై నుంచి రుద్ర (రాధికా ఆప్టే) పేర్నూరులోకి అడుగుపెడుతుంది. భవానీ సామ్రాజ్యాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అమర్‌తో చేతులు కలుపుతుంది. అసలు రుద్ర లక్ష్యం ఏమిటి? భవానీ తన అధికారాన్ని కాపాడుకుందా? వీరిద్దరి మధ్య పోరులో చివరకు ఏం జరిగింది? అన్నదే ఈ సిరీస్ కథ. భవానీ పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఒకవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల, మరోవైపు ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే మహిళగా చక్కగా నటించింది. రాధికా ఆప్టే రుద్ర పాత్రలో తనదైన శైలిలో మెప్పించింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. తన్వి అజ్మీ, మోనికా పన్వార్, మహేశ్ మంజ్రేకర్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా మహిళా పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రత్యేకంగా నిలుస్తుంది. మహిళల ఆధిపత్యంలో నడిచే ఒక క్రిమినల్ సామ్రాజ్యం అనే కొత్త నేపథ్యం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. పేర్నూరు ప్రాంతం, అక్కడి సంప్రదాయాలు, ఆచారాలు, భారీ నగలు, దుస్తులు, కళా దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటనతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. జాన్ స్టీవర్ట్ ఎడురి నేపథ్య సంగీతం, ప్రతీక్ షా సినిమాటోగ్రఫీ కథకు మంచి వాతావరణాన్ని అందించాయి. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా అదే స్థాయిలో ఆసక్తిని కొనసాగించలేకపోయింది. మొదటి ఎపిసోడ్లలో పేర్నూరు ప్రపంచాన్ని, అక్కడి పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. పాత్రలు ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల గందరగోళం ఏర్పడుతుంది. రుద్ర, భవానీ మధ్య పోరును మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నా, కొన్ని కీలక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పండలేదు. అయితే చివరి ఎపిసోడ్లలో వచ్చే యాక్షన్, కొన్ని మలుపులు ఆసక్తిని పెంచుతాయి. మొత్తంగా చెప్పాలంటే, కొత్త నేపథ్యంతో వచ్చిన క్రైమ్ డ్రామా ‘అక్క’. కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటన కోసం, మహిళా గ్యాంగ్‌స్టర్ల కథలను ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. కానీ ఉత్కంఠభరితమైన కథనం ఆశించే వారికి కొన్ని నిరాశ కలిగించే అంశాలున్నాయి. అక్టోబ‌ర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.      [Keerthy Suresh, Akka Web Series Review, Akka Netflix Review, Radhika Apte, Akka Series Telugu Review, Akka OTT Release, Dharmaraj Shetty, Netflix Web Series 2026]
బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి రన్యా రావు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె కర్ణాటకలోని ప్రముఖ హాసనాంబ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అయితే సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా, రన్యా రావు కుటుంబానికి ప్రత్యేక వాహనం, వీఐపీ దర్శనం కల్పించారన్న వార్తలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. రన్యా రావు తన తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ వీఐపీ ప్రోటోకాల్ వాహనంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. గర్భగుడి సమీపానికి వెళ్లి హాసనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన రన్యా రావు వద్ద రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఆమె అరెస్టయ్యారు. అనంతరం ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. 2026 ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కస్టమ్స్ శాఖ భారీ జరిమానా కూడా విధించినట్లు అక్టోబర్‌లో వార్తలు వెలువడ్డాయి. సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండగా, ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల హోదా, పలుకుబడి ఉన్నవారికి ఒక రకమైన మర్యాదలు.. సామాన్య భక్తులకు మరో రకమైన పరిస్థితులా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయాల్లో వీఐపీ దర్శనాల విధానంపై మరోసారి చర్చ మొదలైంది.     [Ranya Rao, Ranya Rao Hasanamba Temple Visit, Ranya Rao Gold Smuggling Case, Hasanamba Temple VIP Darshan, Ranya Rao Latest News, Karnataka News, Gold Smuggling Case, VIP Darshan Controversy]
Bollywood megastar Amitabh Bachchan is reportedly being considered for an important role in Aishwarya Rajinikanth's upcoming directorial venture, Texla, starring Jai in the lead. If the development materialises, it could mark another collaboration between Bachchan and the Rajinikanth family after their recent association in Vettaiyan. According to reports, Aishwarya has approached Amitabh Bachchan and narrated the story along with the character envisioned for him. The filmmaker is said to have reached out to the veteran actor through her father, Superstar Rajinikanth. Bachchan has reportedly shown interest in the project, but has requested that his portions be filmed entirely in Mumbai, considering his shooting schedule and convenience. The makers are said to be seeking approximately 15 days of his dates. Amitabh Bachchan made his Tamil cinema debut with TJ Gnanavel's Vettaiyan, sharing screen space with Rajinikanth. If he comes on board Texla, it will bring him together with another member of the superstar's family, this time under Aishwarya's direction. Jai is reportedly playing the lead role in Texla, which is being developed under the Kannan Ravi Group banner. While further details about the film's cast, storyline and production schedule are awaited, Amitabh Bachchan's possible inclusion has already made the project an interesting development.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్.. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో పోస్టులు పెడుతుంటారు. అయితే ఇలా తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించడం వల్ల ఆయన సినీ కెరీర్‌పై ప్రభావం పడిందని భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తాజాగా వెల్లడించారు. ఇటీవ‌ల‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పోనీ వర్మ ఈ విషయాలను పంచుకున్నారు. ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై మాట్లాడటం మొదట్లో తనను చాలా భయపెట్టేదని చెప్పారు. ముఖ్యంగా తన స్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ 2017లో హత్యకు గురైనప్పుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా కలత చెందారని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తర్వాతే ‘ఇంకెంతకాలం భయపడుతూ బతకాలి?’ అని ఆలోచించి, తనకు తప్పు అనిపించిన విషయాలపై మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిపారు. అయితే ఈ వైఖరి వల్ల ప్రకాశ్ రాజ్ వృత్తిపరంగా నష్టపోయారని పోనీ వర్మ చెప్పారు. రాజకీయ అభిప్రాయాల కారణంగా ఆయనకు రావాల్సిన సినిమా అవకాశాలు, ప్రకటనల ప్రాజెక్టులు చేజారిపోయాయని వెల్లడించారు. కొన్ని సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనను ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న సందర్భాలున్నాయని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పలుమార్లు నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ, తన నమ్మకాల విషయంలో ప్రకాశ్ రాజ్ వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. సినిమా అవకాశాలు, ప్రకటనలు కోల్పోయినా తన మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించకూడదనే నిర్ణయంతోనే ప్రకాశ్ రాజ్ ముందుకు సాగుతున్నారని పోనీ వర్మ వివరించారు. ఆయన రాజకీయ వ్యాఖ్యల వల్ల కుటుంబ సభ్యురాలిగా తనకు భయం కలిగినా, భయంతో మౌనంగా ఉండటం కంటే తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.     [Prakash Raj, Pony Varma, Prakash Raj Political Views, Prakash Raj Lost Film Offers, Prakash Raj Wife Interview, Gauri Lankesh, Telugu Cinema News, Prakash Raj Latest News]
మెగా కోడలు ఉపాసన సమాజంతో పాటు మహిళలకి పలు విషయాల్లో అండదండలు అందిస్తూ కొండంత దైర్యంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.   చిత్తూరులో అపోలోలో విద్యా సంస్థల ద్వారా 5900 మంది విద్యని అభ్యసిస్తున్నారు. త్వరలోనే అర్ధగిరి ఆలయంలో రామ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నాను. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. నా తాతయ్య  ప్రతాప్ రెడ్డి పుట్టిన నెల చిత్తూరుతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది అని సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇది కూడా చదవండి: ధురంధర్ సరసన డ్రాగన్: కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!   .ఉపాసన తల్లి వైపు తండ్రిగారైన  అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం ఆరగొండ గ్రామం. ఉపాసన అమ్మగారైన శోభనా కామినేని గారి తండ్రి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడే జన్మించి, ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచ స్థాయి వైద్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ కారణంగానే ఉపాసన బాల్యం నుంచీ ఆరగొండ గ్రామం మరియు చిత్తూరు జిల్లాతో ఎంతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.     [Upasana Konidela Latest News, Upasana Kamineni, Pratap C Reddy Apollo, Chittoor Aragonda connection, Upasana Ram Charan, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.
రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? రక్త ప్రసరణ సరిగా జరగడం లేదా? రక్తనాళాల్లో బ్లాకులు ఎందుకు ఏర్పడతాయి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుందా? మన వంటింట్లోనే దొరికే నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ చూర్ణంలో ఉపయోగించే దినుసులు ఏమిటి? వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఆయుర్వేద, వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి గల కారణాలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు, నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణం తయారీ విధానం గురించి డాక్టర్ మధుసూదన శర్మ గారి వివరణను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రక్తనాళాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్త ప్రసరణ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోను చూడండి. ముఖ్య గమనిక: రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేద చూర్ణం లేదా ఇతర ఇంటి వైద్యాలను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. రక్తనాళాల్లోని బ్లాకులకు మందులు లేదా స్టెంట్ అవసరమా అనే విషయాన్ని వైద్యులే నిర్ణయించాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
 విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..! శరీరానికి కావాల్సిన విటమిన్లు , పోషకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా కాల్షియం, ఐరన్ లేదా విటమిన్-సి వంటి వాటి గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటాము. కానీ మన శరీరంలో విటమిన్-డి పాత్ర ఎంత ముఖ్యమైనదో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే నేటి కాలపు వైద్యులు చెబుతున్న దాని ప్రకారం విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు మాత్రమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా చాలా అవసరం. ఎండలో తిరిగితే లభించే ఈ విటమిన్ లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రభావం పడుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు , పరిశోధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుంటే.. మన దేశంలో ఎండకు ఎటువంటి కొదవ ఉండదు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ఒక రకమైన సైలెంట్ సమస్యగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి పెద్ద లక్షణాలు లేకుండానే శరీరం లోపల ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇటీవలి కాలంలో జరిగిన పలు వైద్య అధ్యయనాలు ఈ విటమిన్ లోపానికి పురుషులు , మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు మధ్య గట్టి సంబంధం ఉందని వెల్లడించాయి. మహిళలకు.. మహిళల విషయంలో చూస్తే విటమిన్-డి లోపం వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మహిళల నెలసరి క్రమంగా రావడానికి , అండాశయాల నుంచి ప్రతి నెల ఆరోగ్యకరమైన అండం విడుదల కావడానికి కొన్ని రకమైన హార్మోన్లు చాలా అవసరం. విటమిన్-డి మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గినప్పుడు హార్మోన్ల పనితీరు మందగించి అండాల నాణ్యత , సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇది నేరుగా పూర్తిగా సంతానలేమికి కారణం కాకపోయినా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులకు.. పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై విటమిన్-డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత , అవి కదిలే వేగం సక్రమంగా ఉండటంలో ఈ విటమిన్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుంది. పురుషుల శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రత్యేకమైన విటమిన్-డి రిసెప్టర్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని , వీర్యకణాల తయారీని నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో విటమిన్-డి తగినంత లేకపోతే వీర్యకణాల నాణ్యత తగ్గిపోయి తద్వారా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది.  ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మన శరీరంలో విటమిన్-డి ఎంత మోతాదులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లోపం ఉన్నట్లు తేలితే ఆహారపు అలవాట్లలో , జీవనశైలీలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సరిదిద్దుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొంత సమయం ఎండలో గడపడం చాలా మంచిది. దీనితో పాటు గుడ్డు సొన, చేపలు, , విటమిన్-డితో కూడిన పౌష్టికాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ లోపం చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు తగిన సప్లిమెంట్లను వాడుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.                                                                                                                                           *రూపశ్రీ.