Publish Date:May 29, 2023
లోక్ సభ స్థానాలు పెరగనున్నాయా? అంటే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ చేసిన ప్రకటన వింటే ఔననే అనాల్సి ఉంటుంది. త్వరలో పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు.
లోక్ సభ, రాజ్యసభ స్థానాలు పెరగనున్నాయనీ, కొత్త పార్లమెంటు భవనంలో అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. నూతన పార్లమెంట్ భవనలో లోక్ సభలో 888 మంది రాజ్యసభలో 384 మంది కూర్చోవడానికి వీలుగా సీటింగ్ అరేంజ్ మెంట్ చేసినట్లు మోడీ వివరించారు. అయితే 2026 నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అది జరిగితే.. ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి మరో 150 వరకూ అంటే 693 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కనుక అందుకు అనుగుణంగా రాజ్య సభ సీట్లు కూడా పెరుగుతాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు నకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. గతంలో పలు మార్లు తెలుగు రాష్ట్రాల్లో నియోజవర్గాల పెంపు ప్రక్రియ కసరత్తు షురూ అయ్యిందంటూ అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి బహుముఖంగా ప్రచారం జరిగింది.
విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153 కు పెరగాల్సి ఉంది. గతంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా నివేదిక అందితే.. పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరిగింది.
అయితే అదంతా ప్రచారానికే పరిమితమైంది. ఆ తరువాత ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు తెలుగురాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు 2031 వరకూ ఉండే అవకాశం లేదని కేంద్రం విస్పష్టంగా బదులిచ్చింది. కానీ కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలుగు రాష్ట్రాలపై మాత్రం శీతకన్నేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/loksabha-constituencies-increase-25-156003.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్