Publish Date:May 29, 2023
భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలతో పార్టీ ఔట్రీచ్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ, రాబోయే కొద్ది నెలల్లో సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా తన ఓటు బ్యాంకులను పదిలపర్చుకోవాలని చూస్తోంది.
రానున్న రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడంతోపాటు గృహలక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పక్కాగా అమలు చేయాలని చూస్తోంది.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, గొర్రెలను అందజేయాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిదారుల మద్దతు కోరడానికి ఇది చక్కటి అవకాశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులు ఆర్బాటంతో ఈ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూస్తారు.
పోడు భూముల పట్టా కార్యక్రమాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జూన్ 24 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రచారం నిర్వహించి లబ్ది పొందాలని చూస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-kcr-consontration-on-vote-bank-politrics-25-156001.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్