శక్తిశాట్ జెస్సీకి లోకేష్ అభినందనలు.!
Publish Date:Jul 23, 2026
Advertisement
తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న జెస్సీ ప్రతిష్ఠాత్మక లూనార్ మిషన్ శక్తిశాట్ కు ఎంపిక అవ్వడం పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. జెస్సీ సాధించిన ఈ ఘనతకు ఆమెను లోకేష్ హృదయపూర్వకంగా అభినందించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన ఓ పోస్టులో.. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి, నూతన వసతులు కల్పించడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎందుకు అంతగా నిధులు కేటాయిస్తున్నదో, విద్యపై ఎందుకు అంత భారీ పెట్టుబడి పెడుతోందో తెలియజేయడానికి జెస్సీ విజయగాధే నిదర్శనమని పేర్కొన్నారు. ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. జెస్సీ.. ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేసిందనీ, మున్ముందు చంద్రుడిని, ఆపై ఉన్న అత్యున్నత శిఖరాలను అందుకుంటుందనీ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్న లోకేష్.. ఆమెకు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తే.. గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు గ్లోబల్ సైంటిస్టులతో పోటీపడగలరని జెస్సీ నిరూపించిందన్నారు. Kandula Jessie, Mission ShaktiSat, AP Government School Student, Nara Lokesh Praises
http://www.teluguone.com/news/content/lokesh-congratulates-sakthisat-jessie-36-226823.html





