విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా అన్నాహజారే మౌన దీక్ష.!
Publish Date:Jul 23, 2026
Advertisement
ఢిల్లీలో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళణ చేస్తున్న విద్యార్థులకు సామాజిక కార్యకర్త, గాంధేయ వాది అన్నా హజారే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ..తన స్వస్థలమైన మహారాష్ట్ర అహల్యానగర్లో ఆయన గురువారం (జులై 23) ఒక రోజు మౌన దీక్ష చేపట్టారు. తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల ఆవేదనను కేంద్రం తక్షణమే గుర్తించి వారి డిమాండ్లను నెరవేర్చాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో సంస్కరణల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. హక్కుల సాధన కోసం వీధుల్లోకి వచ్చిన విద్యార్థులను నిర్బంధించడం, వారి ఆందోళనను అణచివేయడం సరికాదన్న ఆయన.. కేంద్రం తక్షణమే వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలన్నారు. Silent Protest, Anna Hazare Support, Student Movement Delhi
http://www.teluguone.com/news/content/anna-hazare-observes-a-silent-fast-in-solidarity-to-students-struggle-36-226873.html





