ఆర్మీ భూములపై అక్రమ నిర్మాణాలు.. హైడ్రాను ఆశ్రయించిన రక్షణ శాఖ..!

Publish Date:Jul 23, 2026

Advertisement

 

హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్ గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీఎల్ఆర్ సర్వే నంబర్ 507లో ఉన్న ఆర్మీకి చెందిన ఏ-1 భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. 

ముఖ్యంగా ప్లాట్ నంబర్లు 27, 28 పరిధిలో సుమారు 450 గజాల భూమిని ఆక్రమించి, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే జి+2 భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్మీ భూములపై జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని ఆదేశించారు. స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర రావు కూడా పాల్గొన్నారు. రక్షణ శాఖకు చెందిన భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చట్టబద్ధ మైన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు..

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.