Publish Date:Aug 18, 2025
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కేవలం భేటీలతో సరిపుచ్చడమే కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారికి పలు విజ్ణప్తులు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే... లోకేష్ వినతలు పట్ట కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. నారా లోకేష్ సోమవారం హస్తినలో కేంద్ర మంత్రులు జైశంకర్, జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. అలాగే తమ బృందం సింగపూర్ పర్యటన వివరాలను ఆయనకు తెలిపారు. కాగా ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని విజ్ణప్తి చేశారు. లోకేష్ వినతికి సానుకూలంగా స్పందించిన నడ్డా.. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు
ఇక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన లోకేష్ రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేం దుకు సహకారం, అలాగే ఓఎన్ జీసీకి ఆఫ్ రిగ్ కాంట్రాక్టు సాధనకు తోడ్పడానికి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నితిన్ గడ్కరీతో భేటీలో కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
అలా లోకేష్ కలిసిన ప్రతి కేంద్ర మంత్రీ లోకేష్ సమస్యలు వివరించిన తీరునూ, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాల సాధన విషయంలో కనబరుస్తున్న శ్రద్ధనూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-busy-in-delhi-39-204464.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.