పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన

Publish Date:Oct 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా పరిణమించింది. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అధ:పాతాళానికి పడిపోయింది. రాజధాని అమరావతి నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిలిచిపోయింది. వ్యవసాయం పడకేసింది. శాంతి భద్రతలు గాలిలో దీపంగా మారాయి. జనం భయం గుప్పిట్లో వణికిపోతూ కాలం గడిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పన మాటే వినిపించలేదు. ఇదేమిటంటూ ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లు నోళ్లు తెరిచాయి. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. సమాజంలోని అన్ని వర్గాలూ జగన్ ఐదేళ్ల హయాంలో కష్టాల కడలిలో కాలం గడిపారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టగానే.. కష్టాలు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రం మళ్లీ ప్రగత పథంలో పరుగులు పెడుతోందన్న నమ్మకం కలిగింది. ఇక రాష్ట్ర ఆదాయానికీ, ప్రగతికీ, పురోభివృద్ధికీ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకూ అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పుంజుకుంటోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తరలిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇక మరిన్న పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు  కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. అందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలక  వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమకు చెందిన 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులు హాజరౌతారు.  అమెరికా మాజీ అధ్యక్షులు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ వంటి  స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఇటువంటి సదస్సుకు ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా  పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా  సినర్జీ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో  కీలకంగా మారిందని గుర్తించిన సినర్జీ ప్రతినిథులు  పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై   లోకేశ్ ను ప్రసంగించాల్సిందిగా కోరింది.   

ఆ సదస్సులో పాల్గొనడమే కాకుండా లోకేష్ అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిథులు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు కానున్నారు. శుక్రవారం అక్టోబర్ 25) ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిథులతో భేటీ అవుతారు.  అలాగే శనివారం (అక్టోబర్ 26)  పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అనంతరం భారత కాన్సులేట్ జనరల్ తో సమావేశం అవుతారు. ఆ తరువాత ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే అక్టోబర్ 27న ఆస్టిన్ లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.  28న శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 29న లాస్ వెగాస్ లో ఇటీ సర్వ్ సినర్జీ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్టోబర్ 30న లాస్ వెగాస్ లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శిస్తారు. అలాగే స్టార్టప్స్, ఎంటర్ పెన్యూర్స్ తో భేటీ అవుతారు. అక్టోబర్ 31న జార్జియాలోని శినిమౌంటేన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నవంబర్ 1న న్యూయార్క్ లో పెట్టుబడి దారులతో సమావేశం అవుతారు.  ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడమే తన పర్యటన లక్ష్యమని లోకేష్ చెప్పారు.  

తన అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు లోకేష్ దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతనిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టని చర్యలు, పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చే వారికి ఇస్తున్న రాయతీల గురించి వారికి వివరించారు.   లోకేష్ ప్రజంటేషన్ కు ముగ్ధులైన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు అంగీకరించారు.  

By
en-us Political News

  
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.