కార్యకర్తలే లోకేష్ ధ్యాస.. శ్వాస!

Publish Date:Apr 17, 2026

Advertisement

సాధార‌ణంగా ఒక్కో నాయ‌కుడికి గ్రౌండ్ ఒక్కోలా ప‌రిచ‌యం అవుతుంది. జ‌గ‌న్ లాంటి  కొంద‌రికి స్కాముల ద్వారా రాజ‌కీయాల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతుంటాయి. ఆయ‌న కెరీర్ మొద‌లైందే క్విడ్ ప్రోకోతో. బ‌డా బాబుల‌కు ప‌నులు చేసి పెట్టి.. వారి ద్వారా ఎలాంటి  ల‌బ్ధి పొందాలి? అన్న‌దే జ‌గ‌న్ మైండ్ సెట్ లో ఎక్కువ‌గా తిరుగుతుంటుంద‌ని అంటారు. ఆయ‌న‌కు నిజ‌మైన కార్య‌క‌ర్త అంటే ఎవ‌రు?  వారి బాగోగులేంటి?  వారి స‌మ‌స్య‌లేంటి? అన్న విష‌య‌మే తెలీదు. తాను అధికారంలోకి వ‌చ్చినా కూడా అదే నిర్ల‌క్ష్యం.   దీంతో గ‌త ఎన్నిక‌ల్లో దారుణ‌మైన‌ ఓట‌మి ఎదురైన ప‌రిస్థితులు. ఇప్పుడు కూడా  ఆయ‌నేమీ సుత‌రాయించ‌లేదు. ఆయ‌న‌కు అధికారం అంటే కేవ‌లం అక్ర‌మ మార్గంలో సంపాదించే వెస‌లుబాటు  అంతే.. ఇంకేం లేదు.

అదే లోకేష్  విషయానికి వస్తే.. ఆయన అలాక్కాదు. ఆయ‌న 2013లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిందే. కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన అంశంలో. ఈ విష‌యంలో లోకేష్ క‌న్నా  కార్య‌క‌ర్త‌లే ఎంతో లక్కీ. కార్య‌క‌ర్త‌లను,  వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్..  వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని   వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.

లోకేష్ ఎప్పుడూ ఫోన్లో చూసేది ఏంటో తెలిస్తే షాకై  పోతాం. జ‌గ‌న్ అదే ఫోన్లో ప‌బ్జీ గేమ్స్ ఆడుతుంటే లోకేష్ మాత్రం ఏయే కార్య‌క‌ర్త‌ల నుంచి ఎలాంటి సందేశ‌మొచ్చిందో చూస్తూ ఉంటారు. ఎవ‌రైనా కార్య‌క‌ర్త‌కు బాగోలేక పోయినా, వారి కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రైనా ఆస్ప‌త్రి పాలైనా.. మంచి చెడ్డ‌లు చూడ్డంలో లోకేష్ ముందుంటారు. ఎన్ని ప‌నులున్నా ప‌క్క‌న పెట్టి ఫ‌స్ట్ ఆ ప‌ని చేయ‌మ‌ని త‌న మ‌నుషుల‌ను పుర‌మాయిస్తుంటారు. 

లోకేష్ నోటి నుంచి త‌ర‌చూ వ‌చ్చే మాట‌.. నేనున్నా, నేను చూసుకుంటా.. నువ్వేం భ‌య‌ప‌డ‌కు! ఈ మాట‌ల‌ను న‌మ్మి ఎంద‌రో వారి వారి ఆశ‌ల‌ను తిరిగి పున‌రుజ్జీవం చేసుకున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ కార్య‌క‌ర్త‌ల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే మీరు కావాలంటే చూడొచ్చు.. నాయ‌కుల‌తో అయినా సీరియ‌స్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తారేమో తెలీదు కానీ, కార్య‌క‌ర్త‌ల‌తో మీటింగ్ అంటే చాలు ఆయ‌న‌కు ఎక్క‌డ లేని సంతోషం వ‌చ్చేస్తుంది. వారిని ఎప్పుడెప్పుడు క‌లుద్దామా? అని ఎదురు చూస్తుంటారు.

లోకేష్ న‌మ్మే  సిద్దాంతం అల్లా ఒక్క‌టే.. కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే.. త‌మ త‌మ సొంత‌ సొమ్ముతో పార్టీకి విశేష  సేవ‌లందిస్తుంటారు. వారికి ఇదేదో వ‌స్తుంది.. అదేదో రాబోతుంది అన్న ఆలోచ‌న‌లేం ఉండ‌వు. వారి ఆలోచ‌న‌ల్లా ఒక్క‌టే పేదోడి బ‌తుకు బాగు ప‌డాలి. త‌న అక్క‌న ప‌క్క‌న ఉన్న వారు చ‌ల్ల‌గా ఉండాలి. అందుకే వారు ఎంత దూరంలో పార్టీ కార్య‌క్ర‌మం ఉంటే.. సొంత తిండి  ఖ‌ర్చు, పెట్రోల్ ఖ‌ర్చు పెట్టుకుని వ‌స్తుంటారు. త‌న యువ‌గ‌ళం కూడా అలాగే హిట్ అయ్యింద‌ని లోకేష్ కి బాగా తెలుసు. అందుకే వారంటే ఆయ‌న‌కు తెగ‌ని అనుభంధం, అంతులేని అభిమానం. అంతే కాదు త‌న  కార్యకర్తలను కలుసుకుంటే.. తోబుట్టువుల‌ను క‌లుసుకున్నంత సంబ‌రంగా ఫీల‌వుతారు.

అస‌లు ఇలాంటి వారి స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ తీసుకొచ్చింది తొలుత లోకేషే. కానీ దాన్ని  కూడా తన ఘ‌న‌తే అని గ‌ప్పాలు కొట్టుకుంటారు అవ‌త‌ల పార్టీ ప్ర‌ముఖులు. కానీ లోకేష్ ఎక్క‌డా ఇలాంటి వాటికి స్పందించ‌రు. ఎందుకంటే  స‌గ‌టు కార్య‌క‌ర్త బాగున్న‌పుడే పార్టీ బాగుంటుంద‌ని ఆయ‌న బ‌లంగా విశ్వ‌సిస్తారు. అందుకు త‌గిన‌ట్టుగానే త‌న ప‌థ‌క  ర‌చ‌న చేస్తారు. ఒక కార్య‌క‌ర్త‌కు ఏదైనా ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశ‌ముంటే వెంట‌నే వ‌చ్చేలా చేస్తారు. ఎందుకంటే త‌న కెరీర్ మొద‌లైందే అక్క‌డి నుంచి. వారి తో సావాసం చేసి ఎన్నో గ్రౌండ్ లెవ‌ల్ విష‌యాల‌ను తెలుసుకున్నారాయ‌న‌. అందుకే ఆ రైతు మ‌ట్టిని న‌మ్మిన‌ట్టు.. లోకేష్.. త‌న పుట్టింటి మ‌నుషులైన కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్కువ‌గా విశ్వ‌సిస్తారు. వారితోటిదే జీవితంగా గ‌డ‌పాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తారు.

ప్ర‌స్తుతం లోకేష్ కి ప్ర‌మోష‌న్ ల‌భించింది. జాతీయ కార్య‌ద‌ర్శి నుంచి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారాయ‌న‌. ఈ ప‌ద‌వి త‌న‌క‌న్నా మించి త‌న వాళ్ల‌కు, త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ ప‌డాల‌ని కోరుకుంటారు లోకేష్. ఎందుకంటే ఒక పార్టీ నాయ‌కుడిగా ఆయ‌న జ‌న్మ‌స్థానం, క‌ర్మ‌స్థానం అదే కాబ‌ట్టి.. అందుకే  కార్య‌క‌ర్తంటే కార్య‌క‌ర్త కాదు.. వారు మ‌న య‌జ‌మానుల‌ని అంటారు లోకేష్. అదీ లోకేష్ కి తెలిసిన రాజ‌కీయ క‌ర్త‌వ్యం. కాబ‌ట్టి ప్ర‌తి కార్య‌క‌ర్తా.. ఆయ‌న‌కొచ్చిన ఈ నూత‌న ప‌ద‌వీ లాభం పై ఆయ‌న‌క‌న్నా మించి సంతోషిస్తున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే  పుల‌కించి పోతున్నారనే చెప్పాలి. అందుకే లోకేష్ అంటారు.. నా క‌ర్త‌- క‌ర్మ‌- క్రియ‌.. వాళ్లే.. కార్య‌క‌ర్త‌లే అని!

By
en-us Political News

  
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.