స్థానిక సమరం: కూటమి పార్టీల సీట్ల సర్దుపాట్లు.. దేశం, జనసేన శ్రేణుల్లో భగ్గుమన్నఆగ్రహం.!

Publish Date:Oct 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార తెలుగుదేశం  కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుపాట్లు హాట్ టాపిక్ గా మారాయి.   స్థానిక  సమరం సమయంలో  తెలుగుదేశం  జనసేన పార్టీల మధ్య నెలకొన్న పొత్తుల సమీకరణాలపై క్షేత్రస్థాయిలో  అసమ్మతి, అసంతృప్తి రచ్చకెక్కడం పొలిటికల్ గా సెన్సేషనల్ గా మారింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటుపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా కొందరు నేతలు వ్యవహరిస్తుండటంతో  కలకలం రేపుతోంది. కేడర్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో పార్టీల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగా మారుతున్న దృశ్యం స్పష్టంగా గోచరిస్తోంది.

క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను అంచనా వేయకుండా కేవలం ఉమ్మడి నిర్ణయాల పేరుతో సీట్లను కేటాయించడం పట్ల తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది.  గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇక్కడ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలను, స్థానిక నాయకులను విస్మరించి సీట్ల కేటాయింపు జరగడంపై   విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    మిత్రపక్షాల కోటా కింద స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టడం సమజంసం కాదన్న అసంతృప్తి, ఆగ్రహం ఇరు పార్టీల నేతలలోనూ బాహాటంగా వ్యక్తమౌతోంది.  దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు సైతం క్షేత్రస్థాయి వాస్తవాలను అధిష్టానానికి స్పష్టం చేయడంలో విఫలమవుతున్నారంటూ క్యాడర్ తిరుగుబావుటా ఎగురవేస్తున్న పరిస్థితి ప్రస్ఫుటంగా ద్యోతకమౌతోంది. 

కూటమి ధర్మాన్ని పాటించే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో స్థానిక కేడర్ మనోభావాలు దెబ్బతింటున్నాయన్నది వాస్తవమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏళ్ల  తరబడి ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు గుర్తింపు కరవవుతోంద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో  ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  కొద్ది రోజుల పాటు కూర్చొని పార్టీల అధ్యక్షులు ఎంతో కష్టపడి రూపొందించిన సీట్ల సర్దుబాటు సూత్రాలు గ్రౌండ్ లెవెల్ లో అమలు కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన చోట, సీట్ల సర్దుబాటుపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కూటమి ఐక్యతకు సవాల్ గా పరిణమించింది. 

ఇలాంటి పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,  నియోజకవర్గాల్లోనూ  కనిపిస్తోంది.  తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  అధిష్టానాలు ఒక ఒప్పందానికి వచ్చి సీట్లను ఖరారు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత ఆకాంక్షల కారణంగా ఆ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమనడమే కాకుండా, ఐక్యత విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి.  ఎన్నికల వేళ ఈ తరహా అంతర్గత కుమ్ములాటలు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న ఆందోళన పార్టీల క్యాడర్ లలో వ్యక్తమౌతోంది. 

 ఈ వివాదాలు మరింత ముదరకుండా కూటమి పార్టీల అధిష్ఠానాలు రంగంలోని దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ విభేదాల పర్వం ఇలాగే కొనసాగితే.. స్థానక సమరంలో తెలుగుదేశం కూటమి ఇబ్బందులకు ఎదుర్కొనటం తథ్యమని అంటున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లోపించడం, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తెలెత్తిందని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో కూటమి పార్టీల పెద్దలు  ఈ అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లారుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.  

[Local body Elections Kutami Seat Sharing, Gollaprolu Municipal Elections, TDP Janasena Alliance Disputes, Andhra Pradesh Politics, CBN, PK, 
TeluguOne]

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.