తెలంగాణలో రూ.60 లక్షల మద్యం ధ్వంసం

Publish Date:Mar 25, 2026

Advertisement

 

తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట అధికారులు భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మందుబాబులైతే లబ్బోదివో మొత్తుకున్నారు. అలా మందు బాటిల్స్ ధ్వంసం చేసే బదులు తమకు ఇవ్వచ్చు కదా అంటూ మొరాయించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు గత ఆరు నెలలుగా సాగిన ప్రత్యేక దాడుల్లో భాగంగా, ఢిల్లీ, గోవా, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 

మొత్తం 103 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 6859 మద్యం బాటిళ్లు (3077 లీటర్లు) మరియు 44 బీరు బాటిళ్లు ను అధికారులు ఒకేచోట చేర్చి, పంచుల సమక్షంలో రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.ఈ మద్యం విలువ సుమారు రూ. 60 లక్షలుగా ఉంటుందని అంచనా వేయబడింది. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సిఐ దేవేందర్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు లభించే మద్యంను కొను గోలు చేసి తెలంగాణకు తీసుకురావడం చట్టవిరు ద్ధమని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూరిస్టులతో సహా ఎవరైనా సరే మద్యం తరలింపునకు పాల్పడితే కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన నిఘా కొనసాగుతుందని, ప్రజలు చట్టాలను గౌరవించాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


 

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.