రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారం తగదు : కేశినేని చిన్ని
Publish Date:Apr 25, 2025
Advertisement
లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. త్వరల్లో మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపుతున్నారని, 9 నెలల్లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 21వ సెంచరీ రియాల్టీస్‌లో భాగస్వాములు.. ఎవరో కేశినేని ట్రావెల్స్ భాగస్వాములెవరో అందరికీ తెలిసన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటుంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్నారైల పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని కేశినేని చిన్ని సూచించారు. ఎన్నారైలకు తాము అండగా ఉంటామని, రాష్ట్రంలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతికి నిధులు రాకుండా వైసీపీ బ్యాచ్ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలి’’ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయండి కానీ పెట్టుబడిదారులను భయపెట్టి నాపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు
http://www.teluguone.com/news/content/liquor-scam-39-196899.html





