లిక్కర్ లింక్స్ ఇది అంతం కాదు .. ఆరంభమే

Publish Date:Aug 28, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత, ఈ కుంభకోణంలో తన పాత్ర ఏమాత్రం లేదని మరో మారు స్పష్టం చేశారు. కేంద్రం పై యుద్ధం ప్రకటించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్’గా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయినా భయపడేది లేదని చెప్పు కొచ్చారు. ఒక న్యూస్ చానల్‌ బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో ఆమె లిక్కర్ కుంభకోణంతో పాటుగా రాష్ట్ర, జాతీయ  రాజకీయాలకు సంబంధించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి, న్యాయ పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.అదే సమయంలో ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పు కొచ్చారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితిలో  కవిత అయినా ఇంకొకరు అయినా చేయగలిగింది ఏమీలేదు. ఎందుకంటే, ప్రాధమిక ఆధారాలను బట్టి చూస్తే, అందులో కవిత పాత్ర ఏమిటనేది పక్కన పెడితే, కుంభకోణం జరిగిందినే విషయంలో అనుమానాలు క్రమక్రమంగా తొలిగి పోతున్నాయి. ఇతర విషయాలు ఎలా ఉన్నా, సీబీఐ విచారణ మొదలు కాగానే, ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు మూలాదారంగా ఉన్న, కొత్త లిక్కర్ పాలసీని తీసి పక్కన పెట్టేసింది. మళ్ళీ పాతపాలసీనే అమలు చేయాలని నిర్ణయించింది. నిర్ణయించడమే కాదు, ఆఘమేఘాల మీద, కొత్త సీసాను పాత సారాయితో నింపేసింది.

దీంతో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దాల్ మే కుచ్’ కాలా హై’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా, కేజ్రీవాల్  చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు చేస్తోందని కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు  
సరే,ఆ విషయం ఎలా ఉన్నా, సుమారు గంటకు పైగా సాగిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి బిగ్ డిబేట్  ఇంటర్వ్యూలో,కవిత హావభావాలు, చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరిచిన మర్మగర్భ అభిప్రాయాలను గమనిస్తే  జరగరానిది ఏదో జరుగుతుందనే ఆందోళన ఆమెలో చాలా స్పష్టంగా కనిపించిందని, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కార్యక్రమం ప్రారంభంలోనే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ‘టెన్షన్’ ఫీల్ అవుతున్నారా? అంటూనే చర్చ ప్రారంభించారు. ఆమె అలాంటిదేమీ లేదని, చెప్పుకున్నా ఇంటర్వ్యూ పొడుగునా ఆమె మాటలో, హవా భావాల్లో చివరకు, ఆమె నవ్వులోనూ భయంతో కూడిన టెన్షన్’ కనిపించిందనే అంటున్నారు.

అంతే కాకుండా ముందున్న ఉపద్రవాన్ని ఫేస్ చేసేందుకు కూడా ఆమె మానసికంగా సిద్దమయినట్లుందని, ఆమె సన్నిహితులే చెవులు కోరుకుంటున్నారు.  
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంపై యుద్ధం కొనసాగిస్తారని చెప్పిన కవిత, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసేఆర్’ కు భయపడుతోందని అందుకే తనను టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ని చూసి భయపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఆయన్ని ఏమి చేయలేక తనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందనే ఆరోపణలతో భయపెట్టాలని చూస్తోందన్నారు. ఈడీ, బోడీకి భయపడను అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బీజేపీ ఆయనపై రివేంజ్ తీర్చుకుంటోందన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటక్స్ చేస్తోందని ఆరోపించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని తెలంగాణ విషయంలో బీజేపీ ప్రస్తుతం అదే చేస్తోందన్నారు.

అలాగే, ఇది అంతం  కాదు ఆరంభం మాత్రమే అన్నారు. ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనేక దాడులకు పాల్పడే అవకాశం లేక పోలేదని, ముందుగానే ఒక హింట్ కూడా ఇచ్చారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందన్నారు.  ప్రధాని మోడీ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదన్నారామె. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందన్న కవిత ఇలాంటి సమయంలో అందరూ ప్రశ్నించకపోతే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుందన్నారు.

ఇదంతా ఒకెత్తు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పరోక్షంగానే  అయినా,  చాలా కాలంగా ‘విశ్వసనీయ’ వర్గాల ద్వారా వినవస్తున్న కేసీఆర్ కుటుంబ కలహాల ప్రస్తావన కూడా వచ్చింది. నిజానికి, కవిత చుట్టూ ఇంత దుమారం చెలరేగుతున్నా, ముఖ్యమంత్రి, తండ్రి కేసీఆర్’, మంత్రి, అన్న రామన్న (కేటీఆర్) ఆమెపై వచ్చిన ఆరోపణలను ఖండించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి కవిత కొంత స్మార్ట్’గా సామ్,సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి, వారు స్పందించవలసిన అవసరం లేదని, అందుకే వారుస్పందించలేదని అన్నారు. అయితే, పార్టీ నేతలంతా ఈవిషయంలో తనకు అండగా ఉన్నారన్న కవిత అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.అయితే ఆ ఇద్దరి మౌనం వెనక ఇంకేదో వ్యూహం ఉందని అంటున్నారు. తొందరపడి స్పందిస్తే చిక్కుల్లో పడతామనే భయం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే కవిత అన్నట్లుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అయితే, ముందుముందు బుల్లి తెరపై చూడాల్సింది చాలానే ఉందని అనుకోవచ్చును.

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.