లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
ఇంటి నుంచి సాధారణంగా బయటకు వచ్చిన ఆ మహిళకు.. అదే రోజు చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. లిఫ్ట్‌లోకి అడుగు పెట్టిన క్షణాల్లోనే చోటుచేసుకున్న ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొంది. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో అనసూయ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్ మెంట్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌కు చేరుకున్నారు.
అనంతరం లిఫ్ట్ బటన్ నొక్కగా తలుపులు తెరుచుకున్నాయి. లిఫ్ట్‌లోకి అనసూయ కాలు పెట్టగానే.. ఒక్కసారిగా లిఫ్ట్ కదిలింది అనుకోని ఈ పరిణామంతో ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో నడుము భాగంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు తీసి చందానగర్‌లోని అర్చన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అన సూయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌కు మరమ్మతులు జరుగుతున్నట్లు సమాచారం. లిఫ్ట్ నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకపో వడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? లేక సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మృతురాలి భర్త శ్రీనివాస్ నలగండ్లలోని అపర్ణ జెనిత్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వీరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కు చెందినవారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణ, మరమ్మతులు చేపట్టిన విధానం, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Lift accident in Chandanagar, Annapurna Enclave Apartment, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lift-accident-in-chandanagar-36-228030.html
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర , భారతీయ విధానం అనే అంశంపై మోహన్ భగవత్ ప్రసంగిస్తారు.
శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది.
విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు సాధించడమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారబోదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ గ్రూప్ గా అంటే ఒత్తిడి బృందం గా మాత్రమే విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం పని చేస్తుందని విస్ఫష్టంగా ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.