ప్రెషర్ గ్రూప్ గానే బొద్దింకల పార్టీ.!
Publish Date:Aug 6, 2026
Advertisement
నీట్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై ఉద్యమించి విజయం సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ తన తదుపరి కార్యాచరణ ప్రకటించింది. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు సాధించడమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారబోదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ గ్రూప్ గా అంటే ఒత్తిడి బృందం గా మాత్రమే విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం పని చేస్తుందని విస్ఫష్టంగా ప్రకటించింది. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నివాసంలో ప్రతినిధులు, నిర్వాహకుల సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువడింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ భేటీలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, జాతీయ స్థాయి విస్తరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రజానుకూల, విద్యార్థి అనుకూల విధానాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన వ్యూహంగా ముందుకు సాగుతామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుందన్న వార్తలను సీజేపీ నేత అభిజిత్ దిప్కే ఖండించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై పౌరులకు నమ్మకం సన్నగిల్లిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో నిజమైన మార్పు తెచ్చేందుకు ఇండిపెండెంట్ ప్రెషర్ గ్రూప్ గా నిలవడమే శ్రేయస్కరమని వెల్లడించారు. ఇతర సామాజిక, రాజకీయ వివాదాలలో జోక్యం చేసుకోకుండా కేవలం విద్యారంగానికి సంబంధించిన సమస్యలపైనే పూర్తి దృష్టి సారించాలని శంభాజీనగర్ భేటీలో తీర్మానించినట్లు పేర్కొననారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలతో ఒక బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాలని భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ విద్యార్థుల హక్కులకు భంగం కలిగినా, ఆందోళనలు జరిగినా వాటికి పూర్తి మద్దతుగా నిలుస్తామని దిప్కే చెప్పారు. Cockroach Janata Party remains as pressure group, Abhijit Dipke, Education Reforms, Exam Paper Leak Agitation, Student Pressure Group Network
http://www.teluguone.com/news/content/-cockroach-janata-party-remains-as-pressure-group-36-228134.html





