కరోనాతో కొత్త లైఫ్ స్టైల్!
Publish Date:Aug 7, 2021
Advertisement
మనిషి జీవన గమనాన్నే మార్చేసిన కరోనా వైరస్ ఎప్పుడు, ఎక్కడ,ఎలా పుట్టిందో లేక ఏ ఆధిపత్య విషపు కోరల్లోంచి ఊడిపడిందో కాలమే సమాదానం చెప్తుంది.దాని గురించి మనం ఆలోచించడం కాలం వృదా పనే అవుతుంది. అయితే ఈ మహమ్మారి మనకేం నేర్పించిది. దానినుంచి మనమేమి తెలుసుకోబోతున్నాము అనేదానిమీద మన భవిష్యత్ ఆదునిక జీవన విదానం ఆదారపడబోతుంది. ఆలోచిస్తే మన గత జీవనం, వర్తమాన వైభవం ఒకే స్ట్రైట్ లైన్ లా బాగానే వుంది. కానీ కరోనా గీసిన అడ్డగీతతో వెర్రితలలేస్తున్న మనిషి స్వార్దానికి బ్రేకులుపడ్డాయనేది కాదనలేని వాస్తవం. ఈ స్థితిలో ప్రపంచ జీవన విదానంలో వచ్చే పెను మార్పేమిటి, అందులో బాగంగా మన దేశ జీవన గమనం ఎలా వుండబోతుందనేది ఆశక్తి కలిగించే అంశం . ఇన్ని రోజులూ మన విద్య, వైద్యం, వ్యాపారం, మార్కెటింగ్, సభలూ,సమావేశాలు, వినోదాలూ, వేడుకలూ ఇలా అన్నీ ప్రపంచీకరన నీడలో గ్లోబల్ స్టాండర్డ్స్ లో వుండాలని ఆలోచించాము. అది ఇకనుంచి కొరోనా స్టాండర్డ్స్ లోకి మారబోతుందనేది పచ్చి నిజం. ఒకరకంగా ఇది మనకు మంచి విషయమనే చెప్పాలి.ఎందుకంటే మిడి మిడి జ్ఞానంతో విరుద్ద వాంచలతో ప్రకృతితో మిళితమైన జీవన విదానానికీ, జీవ వైద్యానికీ దూరమైన మనం ఈ కొరొనా తెచ్చిన కొత్త రూల్స్ తో మల్లీ క్రమశిక్షణ కలిగిన కొత్త జీవనానికి స్వాగతం పలకబోతున్నాము. ◆జనగణమన శుభ్రతే మన దేశ సౌభాగ్యం : 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో అందునా ఒక చదరపు కిలోమీటర్ కి వేలల్లో జన నివాసముండే మన మెట్రో నగరాల్లో భౌతిక దూరం సాద్యమేనా? అంటే సాద్యమైంది. మన ఉరుకులు పరుగుల జీవనంలో పెద్దగా ప్రాదాన్యమివ్వని వ్యక్తిగత శుభ్రతకి మన ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. కారణం ప్రాణం పై తీపి ఒక్కటే కాదు మనతో పాటు మన చుట్టూ వుండే వాళ్ళకీ మన వలన ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఆరోగ్యకరమైన సామాజిక స్పృహ కలగడం కూడా ఒక కారణం. ఇది మంచి శుభపరిణామం అనే చెప్పాలి. చేతులను ఒకటికి పది సార్లు శుబ్రం చేసుకోవడం, మాస్కులు దరించడం, తుమ్మినప్పుడు మన తుంపర్లు ఎదుటవారిపై పడకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవడం, తరుచూ వేడినీల్లని తీసుకోవడం లాంటి జాగ్రత్తలు కొరొనా కి ముందు మన దేశంలో ఎంతమంది పాటిస్తున్నారు. అసలు ఎంతమందికి తెలుసు అంటే మనదగ్గర సమాదానం లేదు. అయితే ప్రస్తుతం ఈ జాగ్రత్తల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మన దేశంలో కుప్పలు తెప్పలుగా జన సమీకరణాలతో జరిగే పెళ్లిళ్లు, విందులు, వినోదాలు, సమావేశాలకు కరోనా షరతులతో కూడిన కొత్త నియమావళి అమల్లోకి రావాలని ఆశిద్దాం. దీని ప్రకారం చాలా పరిమిత సంఖ్యలో జనాలు ఆయా వేడుకలకు హాజరు కావాల్సి వుంటుంది. ఇది ఒకరకంగా మంచి విషయంగానే చెప్పాలి ఎందుకంటే అనవసరపు ఆర్భాటాలకి పోయి దుబారాగా చేసే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అలా ఈ మహమ్మారి వచ్చి, మర్చిపోయిన మన ప్రాదమిక ఆరోగ్య నీయమాలని గుర్తుచేయడమే కాకుండా ఖచ్చితంగా ఆచరించేలా చేసింది. ఏది ఏమైనా ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ లో ఆరోగ్యమైన సమాజంతో పాటు వైవిద్యమైన జీవన విదానం మనముందు సాక్షాత్కరిస్తుంది. ◆అగ్రతాంబూలం కాబోతున్న ప్రజా ఆరోగ్యం : తమ స్థూల జాతియోత్పత్తిలో 5 శాతం ప్రజా ఆరోగ్యానికి ఖర్చు పెట్టే అగ్ర దేశాలే ఈ కొరోనా బారిన పడి అతలాకుతలం అవుతున్నది మనం చూస్తున్నాం. కానీ మన దేశం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కేవలం 1 శాతం. ఇదంతా గతం. కానీ కొరొనా వలన కలిగిన అనుభవంతో భవిష్యత్ లో ఖచ్చితంగా ఎక్కువ కేటాయింపులు వుంటాయని అందరూ బావిస్తున్నారు. అలా కాకుంటే మాత్రం మల్లీ ఇలాంటి మహమ్మారి పుడితే మనం కూడా ఎవర్ని బ్రతికించుకోవాలి,ఎవర్ని చంపుకోవాలి అంటూ వయసుని బేరీజు వేసుకొని వైద్యం అందించే పరిస్థితి వచ్చే ప్రమాదం వుంది. అంతే కాదు గ్రామాలల్లో ఉణికి లేకుండా వున్న ప్రభుత్వ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికీ ఆరోగ్య భద్రత , భరోశా ఇవ్వాల్సిన అవసరముంది. వీలైతే ఇంటింటికీ సాద్యమైతే ప్రతి మనిషికీ హెల్త్ ప్రొఫైల్ వుండేలా చర్యలు తీసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్య భారతావనిని మనం చూడగలం. ◆కొరోనా స్టాండర్డ్స్ లోకి మారనున్న మన విద్యా విదానం: కొరోనా కండీషన్స్ లో ముఖ్యమైన తప్పక పాటించాల్సిన నియమం భౌతిక దూరం. కానీ అలా విద్యార్దులని దూర దూరంగా వుంచి తరగతులు నిర్వహించే శక్తి నిజంగా మన విద్యా వ్యవస్థకి వుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితిని అదిగమించడానికి ఆన్ లైన్ క్లాస్ లు కొంత దోహద పడుతున్నాయి . అయితే పూర్తిగా మౌఖిక ◆కొరోనా తెచ్చిన ఆర్ధిక క్రమశిక్షణ: అయితే ఈ మహమ్మారి ప్రపంచానికి గొప్ప గుణపాటమే నేర్పిందని చెప్పాలి. లాక్ డౌన్ వేల దిగువ మద్యతరగతి కుటుంబాల ఆర్ధిక స్థితిగతుల బలహీనతల్ని ప్రపంచానికి ◆కొస మెరుపు : మంచో చెడో ఒక మహమ్మారి కారణంగా మన శక్తేమిటో, మన బలహీనతలేమిటో బేరీజు వేసుకొనే అవకాశం వచ్చిందనే మనమందరం భావించాలి. ఇక మీదట ఇలాంటి మహమ్మారి రాకపోదు - వెంకటేష్ పువ్వాడ
విద్యాబోధనకి అలవాటైన మన వ్యవస్థలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే 75 శాతం మౌఖికంగాను మరో 25 శాతం ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యూజీసీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇదిలా ఉంటే గాలి కూడా ఆడని గదుల్లో విద్యార్థులను గుంపులు గుంపులుగా పోగేసి క్లాసులు చెప్పే కోచింగ్ సెంటర్ల స్వరూపం రానున్న రోజుల్లో మారనుంది. కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగా తరగతి గదుల్ని పెంచుకోవాల్సి వస్తుంది. దీనితో ఆయా సంస్థలు కోర్సుల ఫీజులు పెంచే ప్రమాదం లేకపోలేదు. ఇది మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక శిరోభారం అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా క్లాసులు పెంచి షిఫ్ట్ ల వారీగానైనా బోధన సాగించాల్సి ఉంటుంది. ఇంకో మార్గం 75 శాతం డిజిటల్ అండ్ ఆన్ లైన్ విద్యా విధానం, అయితే ఇది ఇప్పట్లో అమలు సాధ్యం కాదనేది కొంతమంది అభిప్రాయం. కారణం మన దేశంలో చాలా మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన ల్యాప్టాప్ లు, దానికి తగ్గ ఇంటర్ నెట్ సౌకర్యం కలిగినవాళ్ళు చాలా తక్కువమంది వున్నారు. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే ఆ దిశగా సమస్య పరిస్కారానికి ఖచ్చితమైన కసరత్తు జరిగితేనే పూర్తి స్థాయి డిజిటల్ విద్యా విధానం అమలుకి సాధ్యం అవుతుంది.
అద్దం పట్టి చూపించాయి. ఎవరూ ఊహించని,ఎప్పుడూ ఊహించని ఉపద్రవం ఇది. ఒక అంటు వ్యాధి కారణంగా ప్రపంచమంతా దేశాలకి దేశాలు కంచెలేసుకొని లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది అని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయారని ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్ధికంగా బాగా
స్థిరపడినవాడు బాగానే వున్నాడు, అంతో ఇంతో చాలీ చాలని ఆదయాలతో బ్రతుకీడ్చే మధ్యతరగతి వాడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇక వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. కాలంతో పాటు జీవన వ్యయం కూడా పెరగడంతో ఇన్నాళ్లూ వీళ్లంతా పొదుపు గురించి పెద్దగా పట్టించుకుంది లేదు. పది రూపాయలు ఆదాయం వస్తే సరిపోక కొంత అప్పు చేసి జీవనం సాగించే పేద ప్రజలు వున్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పొదుపుపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా వలస కూలీల విషయంలో ఈ రకమైన ఆర్ధిక క్రమశిక్షణ గురించి వారికి అవగాహన కల్పించి పొదుపుని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకొని కొంత ఆర్ధిక భరోసా కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ కరోనా తర్వాత ప్రతి కుటుంబంలో పరిణితి చెందిన ఆర్ధిక క్రమశిక్షణని చూడబోతున్నాం. ఇది మనిషి బలమైన ఆర్ధిక ప్రగతికి పునాదిగా మనం భావించాలి.
అన్న గ్యారంటీ లేదు. అయితే కరోనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో విద్య, వైద్య ఆర్ధిక రంగాలలో బలపడాల్సిన అవసరముంది. ఆవిధంగా అడుగులు పడాల్సిన అవసరముంది. ఎంత
సంక్షోభమైనా అందులోoచే అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లడం మనిషికి కొత్తేమీ కాదు, సోదాహరణ గా చూస్తే గత అనుభవాలే దీనికి నిదర్శనం. అంతిమంగా మనిషిదే విజయం.
http://www.teluguone.com/news/content/lifestyle-changes-after-covid-19-35-118886.html





