18+లో చూసే దృష్టికోణం మారాలి
Publish Date:Jul 7, 2021
Advertisement
సమాజాన్ని అంతో ఇంతో ప్రభావితం చేయగలిగేది సాహిత్యం అని నా అభిప్రాయం. ఇందులో కథ, కవిత్వం, నాటకం, సంగీతం, సినిమా ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకం. అయితే ఇప్పుడు యువతను బాగా ప్రభావితం చేస్తుంది సినిమా. మరి అలాంటి సినిమాని యువత ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నారు? అనేది మనం గమనించాలి. కథలో ముఖ్యంగా సినిమా కథల్లో ప్రత్యేకించి మంచిని వేరు చేసి చూపించరు. కథలో భాగంగా ఉంటుంది. ఇది చర్చ ద్వారానే అవగతమవుతుంది. అయితే ఆ చర్చ ఎవరితో జరగాలి? తల్లిదండ్రులతో జరగాలి. గురువులతో జరగాలి అప్పుడే అందులో ఉన్న అంతః సారం గురించి అర్ధవంతమైన చర్చ జరుగుతుంది. అంతేగాని సమవయస్కులైన మిత్రులతో కలిసి చర్చిస్తే అనవసరమైన విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఉదాహరణకు "పోకిరి" సినిమాని తీసుకుందాం. ఆ సినిమాని చూసిన పద్దెనిమిది, ఇరవయ్యేళ్ల వయసువాళ్లు మిత్రులతో కలిసి ఎక్కువగా ఏమి చర్చిస్తారో తెలుసా? హీరోయిన్ డైలీ ఆఫీస్ కి తీసుకెళ్లే ఉప్మా గురించి. ప్రతి కథానాయకుడు స్త్రీల పట్ల అసభ్యంగా చేసిన పద ప్రయోగాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు. ఇదే కథని తల్లిదండ్రులవద్ద లేదా గురువుల వద్ద చర్చకు వస్తే విషయం వేరుగా ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్క చేయక, దుష్టుల చేతిలో భార్యను కోల్పోయిన తండ్రి నే స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకు అయిన హీరో గొప్పతనం గురించి కచ్చితంగా చర్చకు వస్తుంది. అయితే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూసి వచ్చిన సినిమా గురించి చర్చిస్తున్నారు. విని వారి అనుభవ సారం నుంచి అర్ధమైన విషయం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పగలుగుతున్నారు అంటే వెళ్లపై లెక్కపెట్టవచ్చు. కునుకు మంచి అయినా చెడు అయినా పిల్లలతో చర్చించండి. వారికి అర్ధమైంది తెలుసుకోండి. మీకు అర్ధమైంది వివరించండి. అప్పుడే శోధనాత్మకమైన యువ సమాజం నిర్మితమవుతుంది. - వెంకటేష్ పువ్వాడ
http://www.teluguone.com/news/content/18-plus-life-style-35-119029.html





