పెద్దవారిని ఈ ప్రశ్నలు అడిగి చూడండి.. వారి సమాధానాలు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతాయి..!

Publish Date:Jan 24, 2026

Advertisement

నేటి తరానికి పెద్దవారంటే చాదస్తపు మనుషులు.  కొంచెం కూడా ఫ్యాషన్ తెలియని మొరటు మనుషులు.  అమ్మమ్మలు, తాతయ్యలు అంటే కేవలం పాకెట్ మనీ లేదా పుట్టినరోజు, పండుగ రోజుకు డబ్బులు ఇచ్చే వారుగా మాత్రమే తెలుసు చాలామందికి.  కానీ వారి జీవితం ఎన్నో అనుభవాలను,  జీవిత పాఠాలను పోగేసుకొని ఉంటుంది.  చాలామంది పెద్దలు కూడా తమ మనవళ్లు,  మనవరాళ్లతో ఏదైనా మాట్లాడాలన్నా నేటికాలం యువత నుండి పిల్లల వరకు అస్తమానం పోన్లు చేతితో పట్టుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తుంటారు.  తిన్నావా లేదా తినడానికి ఏమైనా కావాలా అని అడగడం లేదా ఏమైనా చేసివ్వాలా లేదా తెచ్చివ్వాలా  అని అడగడం వరకే ఉంటుంది. కానీ  వారి జీవితంలో ఎన్నో బయటకు తెలియని కథలు ఉంటాయి. పెద్దవారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా.. వారిచ్చే సమాధానాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.  ఇంతకీ పెద్దవారిని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? తెలుసుకుంటే..

చిన్నతనం జ్ఞాపకాలు..

ప్రతి తరానికి జీవనం,  పరిస్థితులు,  సౌకర్యాలు,  ఇబ్బందులు అన్నీ మారుతూ ఉంటాయి.  30 ఏళ్ల కిందట ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న సమస్యలు రేపటి తరానికి ఉండకపోవచ్చు.  బాల్యం కూడా అంతే.. పెద్దవారి బాల్యం గురించి ఒక్కసారి కదిలిస్తే.. వారి బాల్యం ఎన్నో పాఠాలు నేర్పుతుంది.  నేటికాలంలో మనకు లభిస్తున్న,  లభించిన జీవితం,  సౌకర్యాలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది.

అభిరుచులు..

వయసుతో పాటు అభిరుచులు మారుతూ ఉంటాయి.  పెద్దవారు కూడా వారి చిన్నతనం నుండి అభిరుచులు ఎలా ఉన్నాయి.  ఎంత వయసు పెరిగినా మారని  అభిరుచులు ఏంటి  అని అడిగితే.. వారు చెప్పే సమాధానంలో.. కాలం మారిన చెదరని ఎన్నో లక్ష్యాలు కనిపిస్తాయి.  

జ్ఞాపకాలు..

పెద్దల జీవితం చాలా వరకు జ్ఞాపకాలలోనే మూలుగుతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చే విషయాలను కదిలిస్తే వారి జీవితంలో ఎంతో గొప్ప క్షణాలు బయటికి వస్తాయి.  అవి నేటి తరం వారికి ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

చెప్పలేని విషయాలు..

 ప్రతి ఒక్కరికి కొన్ని రహస్యాలు ఉంటాయి.  చాలామంది గురించి బయటకు తెలిసిన విషయాలే కాకుండా,  బయటకు తెలియని విషయాలు కూడా ఉంటాయి. పెద్దలను ఒక్కసారి వీటి గురించి కదిలిస్తే వారిలో ఉన్న మరొక కోణం కూడా తెలుస్తుంది.  ఆ వయసులో వారి గురించి ఇలా తెలియడం పట్ల వారు కూడా ఎంతో సంతోషిస్తారు.

కష్టాలు..

కష్టాలు ప్రతి ఒక్కరికి సహజం.  అయితే కొన్నేళ్ళ కిందట పెద్దలు ఎదుర్కున్న కష్టాల  గురించి వెంటే.. వాటి ముందు నేటి తరం వారి కష్టాలు దూదిపింజలా అనిపిస్తాయి.  నిజానికి ఈ కాలం వారు సమస్యలను ఎదుర్కోవడానికి,  ధైర్యంగా ఉండటానికి పెద్దల కష్టాలను వినడం కూడా గొప్ప ఊరట,  మనోనిబ్బరం ఇస్తాయి.

సలహా..

పెద్దలు ఏదైనా చెప్పినా, సలహా ఇచ్చినా.. వారి జీవితంలో అప్పటికే ఎదురైన కొన్ని అనుభవాల ఆధారంగా ఇస్తారు. అంతే కానీ వయసు పెరిగింది కాబట్టి పెద్దరికంతో ఇస్తున్నారు అనుకోకూడదు.  వారు ఇచ్చే సలహాలు,  చెప్పే విషయాలు జీవితాన్ని మార్చే  గొప్ప పాఠాలు,  మలుపులు కాగలవు.

ఆనందం..

ఆనందం అంటే సినిమా చూడటం, తినడం,  నచ్చినట్టు బ్రతకడం  అనుకుంటారు చాలా మంది.  కానీ ఆనందం గురించి పెద్దలను అడిగితే ఖచ్చితంగా తృప్తి అనే కోణంలో సమాధానం వస్తుంది. ఏ పుస్తకం అందించలేని జ్ఞానాన్ని పెద్దలు చెప్పే విషయాలు నేర్పుతాయి.

పైన పేర్కొన్న ప్రశ్నలు.. కేవలం పెద్దలను పలకరించడానికి కాదు.. వారు చెప్పే సమాధానాలు ప్రతి వ్యక్తికి ఏ పుస్తకంలోనూ దొరకని పాఠాలు అవుతాయి.  జీవితంలో ఏదో ఒక సందర్భంలో పెద్దల సమాధానాలు పరిష్కారాలు చూపుతాయి.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.