నాయకులు బాగుపడ్డారు.. ప్రజలు నష్టపోయారు: కుల రాజకీయాలపై పవన్ షాకింగ్ కామెంట్స్

Publish Date:Jun 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల పేరుతో జరుగుతున్న విద్వేష రాజకీయాలపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి  ద్వారా కొందరు నాయకులు మాత్రమే బాగా బాగుపడ్డారని, ఆయా కులాల్లోని సామాన్య ప్రజలు మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారనిఅన్నారు.  అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్..  కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని  పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే  జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.

  వైసీపీ  హయాంలో కుల రాజకీయాలు, ఒకరినొకరు కులం పేరుతో దూషించుకునే సంస్కృతి పరాకాష్టకు చేరిందని విమర్శించిన పవన్ కల్యాణ్..  నిజానికి 1998 నుంచే ఈ తరహా కుల ధోరణులు మొదలైనప్పటికీ,   వైసీపీ పాలనలో ఆ ధోరణులు పీక్స్ చేరుకున్నాయనీ,  జర్నలిస్టులను సైతం కులం పేరుతో బహిరంగంగా దూషించే స్థాయికి పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని దారుణమైన ఘటనలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ, దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని ఏకంగా డోర్ డెలివరీ చేసినా అప్పటి పాలకులు హంతకుడిని వెనకేసుకొచ్చారన్నారు. అంత పెద్ద దారుణం జరిగినా దళిత సంఘాలు సైతం భయంతో మాట్లాడలేని నిరంకుశ పరిస్థితిని సృష్టించారనీ,  అదేవిధంగా..  కరోనా మహమ్మారి సమయంలో కేవలం నిజాలు మాట్లాడినందుకు డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా తీవ్రంగా హింసించి, ఆయన మరణానికి కారణమైనప్పుడు ఏ కుల సంఘాలూ నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు కుల సంఘాల నాయకులు మౌనంగా ఉండిపోవడం వల్లే ఆయా నాయకులు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని, కానీ ప్రజలు మాత్రం తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. 

మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు కలలుగన్న కుల నిర్మూలన అనే ఆశయం నేటి రోజుల్లో పూర్తిగా సాధ్యమో కాదో తెలియదు కానీ..  కులాల మధ్య కనీస ఐక్యత, పరస్పర సహకారం ఉండటం నేటి సమాజానికి అత్యంత అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విచ్ఛిన్నకర కుల రాజకీయాలకు ముగింపు పలకాలని తమ   ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని తెలిపారు.  ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో కులాల ఐక్యతను చాటుతూ, కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఆధారంగానే రాజకీయాలు సాగుతాయని, ఇందుకు జనసేన నాయకత్వం  కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.