విధ్వంసం నుంచి వికాసానికి.. చరిత్రలో నిలిచిపోయే జూన్ 4!
Publish Date:Jun 4, 2026
Advertisement
గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసకర మార్గం నుంచి అభివృద్ధి, వికాసం వైపు నడిపించాలనే బలమైన సంకల్పంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో గత రెండేళ్లుగా అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హెల్దీ , వెల్దీ), హ్యాపీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, వారి నమ్మకమే తమకు కొండంత బలమనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లోనూ పాలన సాగుతుందని పునరుద్ఘాటించారు.
http://www.teluguone.com/news/content/from-destruction-to-development-39-221782.html





