Publish Date:Aug 31, 2024
విజయవాడలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. స్థానిక క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. నాలుగు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రొక్లెయినర్ల సహకారంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సహాయక చర్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదని అనుకున్నారు. అయితే ఆ తర్వాత శిథిలాల కింద కొంతమంది వున్నారని గుర్తించారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రభుత్వం పరంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని స్థానికులకు అధికారులు హామీ ఇచ్చారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని అధికారులు, నాయకులు ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/landslide-in-vijayawada-25-183982.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.