పెద్దల సభకు లక్ష్మణ్ బీజేపే వ్యూహం ఏంటి ?

Publish Date:May 31, 2022

Advertisement

రాజ్య సభ ఎన్నికలు ఇంత రసవత్తరంగా సాగడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి కావచ్చును. ఒకే సారి 50 పైగా స్థానాలకు ఎన్నికలు జరగడం ఒకెత్తు అయితే, రానున్న రెండు సంవత్సరాల కాలంలో, జరగనున్న గుజారత్, కర్ణాటక, తెలంగాణ సహా మరొకొన్ని కీలక రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు, ఆ వెంటనే వచ్చే 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు, ఆచి తూచి అభ్యర్ధుల ఎంపిక చేస్తున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్’తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పాత్రను పోషిచున్న ప్రాంతీయ పార్టీలు, ఇక్కడి  నేతలను అక్కడ అక్కడి నేతలను ఇక్కడ సర్దుబాటు చేయడంతో రాజ్యసభ రాజకీయం వేడెక్కింది. సాధారణంగా అంతగా చడీ చప్పుడు లేకుండా అయిపోయే, రాజ్యసభ ఎన్నికలు క్రతువు ఈసారి గట్టిగానే రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా, తెలంగాణ నుంచి మూడు, ఏపీ నుంచి నాలుగు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడు స్థానాలు ఖాళీ అయితే, అన్ని స్థానాలను అక్కడి, ఇక్కడి అధికార పార్టీల అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎగరేసుకు పోయారు. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అవకాశం లేకున్నా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌’ను ఉత్తర ప్రదేశ్ నుంచి బరిలో దించింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకు ఉన్న సంఖ్యా బలంతో, లక్ష్మణ్’కు పెద్దల సభలో సీటు ఖరారు అయినట్లే అనుకోవచ్చును. 
అయితే, పార్టీ జాతీయ నాయకత్వం, ఉభయ తెలుగు రాష్ట్ర్రాల నుంచి పోటీలో ఉన్న ఇతర నాయకులను కాదని లక్ష్మణ్’ను పికప్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ విషయాన్ని పక్కన పెట్టినా తెలంగాణ నుంఛి, లక్ష్మణ్’తోపాటు రాజ్యసభ మాజీ సభ్యుడు, గరికపాటి మోహనరావు, సినీనటి విజయశాంతి, పార్టీ సీనియర్ నాయకుడు, ఇంతవరకు పోటీకి ఎప్పుడూ అవకాశం రాని, మురళీ ధర రావు, రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,పార్టీ మాజే అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి వంటి కొందరి పేర్లు కూడా వినిపించాయి. అయితే, ఈ అందరినీ కాదని, ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ పదివిలో ఉన్న లక్ష్మణ్’ కు ఎందుకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీ లోపల వెలుపల కూడా జరుగుతోంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీ ఓట్లను ఆకర్షించేందుకే లక్ష్మణ్’కు అవకాశం ఇచ్చారని పార్టీ నాయకులు పైకి చెపుతున్నారు. 

అయితే, అది నిజం కాదు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పారని పార్టీ వర్గాల్లో మరో వాదన వినిపిస్తోంది. నిజానికి, ఒకప్పుడు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మధ్య  అంత గొప్ప సంయోధ్యత లేదు. లక్ష్మణ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, కిషన్ రెడ్డి బీజీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక విధమైన కోల్డ్ వార్ ‘నడిచింది. లక్ష్మణ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న రోజులో కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్ గడప తొక్కలేదని, అంటారు. అది అక్షర సత్యం అయినా కాకపోయినా, ఇద్దరి మధ్య సయోధ్య లేదనేది మాత్రం కాదనలేని నిజం. 

అయితే, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, కొత్త ఈక్వేషన్స్’లో భాగంగా పాత  మిత్రులు కిషన్ రెడ్డి,లక్ష్మణ్ చేతులు కలిపారని, ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రాష్ట్ర పార్టీపై తమ పట్టు సడలకుండా చూసుకునిందుకే కిషన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పి, లక్ష్మణ్’ను పెద్దల సభకు పపంపడంలో కీలక భూమికను పోషించారని పార్టీ వర్గాల సమాచారం. 

అయితే రాష్ట్ర బీజేపీలో మొదటి నుంచి కూడా లీడర్ల కంటే, గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే, పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం, సిద్ధాంత పునాదులున్న పాత కాపులను, పక్కకు తప్పించి, ఇతర పార్టీల నుంచి వచ్చిన మాస్ లీడర్లకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  లక్ష్మణ్’ను రాజ్యసభకు పంపడం కూడా అందులో భాగమే అంటున్నారు.

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.