Publish Date:May 31, 2022
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి త్వరలో బుల్లెట్ ప్రూఫ్ కారు రానున్నది. పార్టీ అధిష్టానం ఆయన కోసం ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసి అందిస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోనికి తీసుకురావడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బండికి ప్రాణహాని ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
అధికార టీఆర్ఎస్ పై విమర్శలతో దూసుకెళుతున్న బండి సంజయ్ ఆ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదులను తవ్వాలి అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. బండి సంజయ్ హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతున్నారన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినవస్తున్న సంగతి తెలిసిందే.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బీజేపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. బండికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలని నిర్ణయించింది. రూ. 2 కోట్లు కేటాయించింది.ఇందుకోసం ఇప్పటికే కొటేషన్లు ఆహ్వానించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bullet-proof-car-to-bandi-sanjay-25-136760.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.