Publish Date:Aug 18, 2025
నెల్లూరులో ఓ మహిళా మణి . ఈమె పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆ ఆట ఆడారు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోలీసు అధికారులు అంతా ఆమె గుప్పెట్లో ఉన్నారనే టాక్ ఉంది. అప్పుడు ఆమె ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగింది… కూటమి పాలనలోనూ అదే ఆట ఆడాలనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి.
ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పెరోల్ పచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాకరించారు. అయితే ఓ రోజు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. దాంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తీగ లాగితే డొంక కదిలింది. ఈ పెరోల్ కథ అంతా ఓ మహిళ నడిపిందని .. కొంత మంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది.
ఆ మహిళ నెల్లూరులో ఓ బొటిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు.. రాజకీయ నేతలకు బొకేలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీసు శాఖలో అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లవరే శ్రీకాంత్. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓ సారి అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ నెరజాణ తన లవర్‌తో గడిపేందుకు నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయి వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని చెబుతున్నారు. ఇప్పుడీ నెరజాణ గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు.. రాజకీయ నేతలు ఎవరు.. అన్నీ బయటకు తీసే పనిలో అధికారులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lady-don-in-nellore-39-204450.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.