నెల్లూరులో లేడీ డాన్.. చక్రం తిప్పితే పెరోల్
Publish Date:Aug 18, 2025
Advertisement
నెల్లూరులో ఓ మహిళా మణి . ఈమె పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆ ఆట ఆడారు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోలీసు అధికారులు అంతా ఆమె గుప్పెట్లో ఉన్నారనే టాక్ ఉంది. అప్పుడు ఆమె ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగింది… కూటమి పాలనలోనూ అదే ఆట ఆడాలనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పెరోల్ పచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాకరించారు. అయితే ఓ రోజు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. దాంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తీగ లాగితే డొంక కదిలింది. ఈ పెరోల్ కథ అంతా ఓ మహిళ నడిపిందని .. కొంత మంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది. ఆ మహిళ నెల్లూరులో ఓ బొటిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు.. రాజకీయ నేతలకు బొకేలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీసు శాఖలో అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లవరే శ్రీకాంత్. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓ సారి అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెరజాణ తన లవర్‌తో గడిపేందుకు నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయి వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని చెబుతున్నారు. ఇప్పుడీ నెరజాణ గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు.. రాజకీయ నేతలు ఎవరు.. అన్నీ బయటకు తీసే పనిలో అధికారులు ఉన్నారు.
http://www.teluguone.com/news/content/lady-don-in-nellore-39-204450.html





