Publish Date:Aug 11, 2022
ఎన్నికలు రాగానే పార్టీలు రెండింతల ఉత్సాహాన్ని కూడా ప్రదర్శించడానికి తయారవుతారు. ప్రస్టుతం తెలంగాణా రాజకీయ వాతావరణం అంతా మునుగోడు మీదనే ఆవహించింది. తాజాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీ నీడలోకి వెళిపోవడంతో బెంబేలెత్తిన పార్టీ పైకి ధైర్యం, గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి మునుగోడులో జరిగేది ఉప ఎన్నికే. కానీ తెలంగాణాలో అన్ని పార్టీలు దానిమీదే దృష్టి పెట్టాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉండబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశిం చేది కావడంతో.. ఎంత కాదన్నా, ఎవరు వద్దన్నా అభ్యర్థుల ఎంపికలో చివరకు ఆర్థికబలం కూడా అదన పు అర్హతగా చేరిం ది. టీఆర్‌ఎస్‌లో ఆర్థిక అంశం పెద్ద విషయం కాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీగా నిధులకు కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేకపోయినా.. ఉన్నవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థినే ఎంపిక చేస్తారన్న వాదన ఉంది.
రేసులో ఉన్న మరో నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసన మండలి చైర్మన్‌గా ఉన్నందున ఆయనను ఉప ఎన్నిక బరిలోకి దించే ఆలోచనను అధినాయ కత్వం చేయలేదని తెలుస్తోంది. వారిని చూసి వీరు, వీరిని చూసి వారు అన్న ట్టు ఇపుడు కాంగ్రెస్‌లోనూ అభ్యర్ధి ఎంపికకు ఆర్ధిక అంశాన్ని ఒక కండీషన్ గా నిర్దేశించుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో చేరిపోయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ను ఖాళీ చేసే పనిలో భాగంగా మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. ఈ సమావే శాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారని చెబుతున్నారు. వారికి భరోసా ఇచ్చి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు అంశమే ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే అభ్యర్థి పేరు ప్రక టించకుం డా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెల కొల్పి నెలా ఖరుకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
మునుగోడులో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో ఏఐసీసీ కార్యద ర్శి బోసు రాజు బుధవారం (ఆగష్టు 10న)గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికలో విజయం కోసం అవలంబించా ల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అధిష్ఠానమే అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. సర్వేలు, గ్రామస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lack-of-confidence-in-congress-on-munugodu-39-141724.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.