ఎనిమిదేళ్ల కైలీ.. మనసు బహు దొడ్డది!
Publish Date:Jul 18, 2022
Advertisement
బాల్యంలో తండ్రిని కోల్పోవడం జీవితంలో ఎదిగేకొద్దీ పెనుబాధనే ఇస్తుంది. వెన్నుదన్నుగా ఉండా ల్సిన తండ్రి లేకపోవడం ఆర్ధికంగా, మానసికంగానూ పిల్లలకు సమస్యే. పెద్దవారు ఆ పరిస్థితులను అర్ధంచేసుకుని భవిష్యత్ జీవితానికి గతాన్ని వదిలే యగల్గుతారు. కానీ పిల్లలు ఆటపాటలు, స్కూలు జీవితంలో ప్రతీ సందర్భంలో తండ్రి లోటు బాగా సమస్యాత్మకంగా మారు తుంది. స్కూలు స్నేహితులు, చుట్టుపక్కల వారి పిల్లలు, వారి తల్లిదండ్రులను చూస్తున్నపుడు తండ్రిలేని పిల్లల పరిస్థితి వర్ణనా తీతం. బయటికి చెప్పుకోలేని బాధ వెన్నాడుతూనే వుంటుంది. ఇలాంటి పరిస్థితులు తన స్నేహి తులుగాని, మరెవ్వరుగానీ ఎదుర్కోరాదని షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్ అనే ఎనిమిదేళ్ల పిల్ల అనుకుంది. ఆమె తండ్రి ఆత్మహత్యచేసుకున్నాడని తెలుసుకున్నది. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటా రన్నది ఆమెకు తెలియలేదు. అనేకానేక కారణాలు ఉండవచ్చని ఎందరో చెప్పారు. కానీ దానికి సంబంధించిన అవగాహన కోసం డబ్బును సేకరించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల విస్కాన్సిన్ అమ్మాయి, ఇతర పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎదగ కుండా చూసుకోవడానికి తన వంతు సహాయం చేయాలనుకుంది. ఆత్మహత్య నివారణ కోసం ఆమె నిమ్మరసం 800 షిల్లింగులు సేకరించింది. షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్, తన తండ్రి 32 ఏళ్ల జోర్డాన్ వేక్‌ఫీల్డ్‌తో కలిసి డిస్క్ గోల్ఫ్, వీడియో గేమ్‌లు ఆడటం పార్కు లకు వెళ్లడం గుర్తుచేసుకుంది. అతను చాలా సరదా మనిషి, తన పట్ల శ్రద్ధ వహించేవాడు. అతను ఎప్పుడూ ఏ విషయంలోనూ అస్సలు కూతురుని కోపగించుకునే వాడు కాదు. కైలీ తండ్రి నవంబర్ 2019లో ఆత్మహత్యతో చనిపోయాడు. అప్పటికి ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్నందున, అతను ఎలా చని పోయాడో ఆ సమయంలో కైలీ తల్లి ఆమెకు చెప్పలేదు. ఆమె తల్లి 30 ఏళ్ల బ్రిటనీ బ్రూనెట్-తిమ్మెస్చ్ ఆ అపరాధ భావం తోనే ఉండేది. కానీ ఆమె ఆ సందర్భాన్ని, సంఘట నను వివరించే మానసిక స్థితిలో లేదు. అందరూ ఆమెను అర్ధంచేసుకుని చాలాకాలం నుంచి మౌనం వహించారు. షెబోయ్‌గాన్ ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ సబ్ సెక్రటరీ అయిన బ్రూనెట్-తిమ్మెష్ కి తన కూతురు కైలీ థెరపిస్ట్ ఒకరోజు కలిశారు. మాటల మధ్యలో ఆమె కైలీకి అర్ధమయ్యేలా మెల్లగా చెప్పమని కోరారు. మీరు చివరికి ఆమెకు ఏదో ఒక రోజు చెప్పవలసి ఉంటుంది. ఆమె పెద్దదవుతోంది. పిల్లలు మాట్లా డటం మొదలుపెట్టబోతున్నారు అనీ హెచ్చరించారు. కానీ కొన్ని నెలల క్రితం, కైలీ తన తల్లిని అడిగింది.. తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటున్నానని. కానీ ఆమెకు ఆ సంగతి తెలియ కుండా వుండడమే అవసరమని ఆమె తల్లి చెప్పలేదు. మరో రెండు నెలల తర్వాత మళ్లీ వారి మధ్య పెద్ద చర్చ జరిగింది. ఈ సంవత్సరం జూలై 9న తన తండ్రి పుట్టినరోజును పురస్క రించుకుని, కైలీ అతని జ్ఞాపకార్థం నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేయా లని నిర్ణయించుకుంది, తద్వారా వచ్చిన మొత్తాన్ని షెబోగాన్‌లోని మెంటల్ హెల్త్ అమెరికాకు విరా ళంగా ఇచ్చింది. సేవలను పొందలేని వ్యక్తులకు సేవలను పొందేందుకు సహాయం చేయాలని ఆమె కోరుకుంది, తద్వారా ఇది మరొక వ్యక్తికి జరగదు లేదా మరొక పిల్లవాడు తల్లిదండ్రులు లేకుండా వెళ్లవలసిన అవసరం లేదని ఆమె తల్లి వివరించింది. కైలీ జులై 1, జూలై 8న రెండు రోజులలో నిమ్మ రసం విక్రయించి మొత్తం 800 షిల్లింగులు వసూలు చేసింది. ఇప్పుడు, ఆమె దీనిని వార్షిక సంప్రదా యంగా మార్చాలని యోచిస్తోంది. కైలీ చిన్నపిల్లే.. మనసు దొడ్డది.
http://www.teluguone.com/news/content/kylie--25-139976.html





