క్లౌడ్‌బ‌ర్‌స్ట్‌... వ‌రుణుడి అస్త్ర‌మా.. విదేశీ అస్త్ర‌మా? !

Publish Date:Jul 18, 2022

Advertisement

గ‌త ప‌ది రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ వ‌ర్షాలు కుమ్మ‌రించిన‌ట్లు ప‌డుతున్నాయి. మంచి  వ‌ర్షాకాలం కాకున్నా కుంభ‌వృష్టి ప‌డింది, ప‌డుతోంద‌న్న వార్త‌లే వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇవేమంత‌గా మ‌రీ ఆనందం పంచ‌డం లేదు. మేఘారే.. మేఘా..మేఘా.. అంటూ గెంతులెయ్య‌డానికీ వీలులేదు.  అకాల వ‌ర్ష‌మే. అన్ని ప్రాంతాలూ భారీగా న‌ష్ట‌పోయాయి. కానీ స‌మ‌యంగాని స‌మ‌యంలో వ‌చ్చిన ఈ కుంభ‌వృష్టి  వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆలోచించేట్టు చేసింది. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం దీన్ని విదేశీ కుట్ర‌గానే భావిస్తున్నారు. మ‌రి ఇవి వారు పంపిన మేఘ‌శ‌రాలా లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది శాస్త్ర‌వేత్త‌లే తేల్చాలి.  

ఈ కుంభవృష్టి అనేది చాలాకాలం నుంచి వింటున్న మాట‌. ఇటీవ‌లి కాలంలో వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు అంటున్న మ‌రొక ప‌దం  క్లౌడ్ బ‌ర్‌స్ట్‌! అంటే ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీ టర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు. కుంభం అంటే కుండ అలాగే ఒక కుండ బద్దలు అయ్యి దాని లోని  నీళ్ళు  ఒకేసారి  బయటికి వస్తే ?  క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది చాలా  అరుదుగా  జరిగే  ప్రక్రియ. దీనిని  కృత్రి మంగా సృష్టించలేరు. అలా చేయాలంటే ఒకే చోట మేఘాలని ఆపేసి అవి  కురి సేట్లుగా చేయాలి. కానీ మేఘాలు ఏమన్నా మేకలు, గొర్రెలా ?  ఒకే చోట ఆపి అవి వర్షం పడేట్లుగా చేయ డానికి ?

కృత్రిమ మేఘాలని సృష్టించ వచ్చు అదీ ఆ ప్రాంతంలో కొద్దో గొప్పో మేఘాలు ఉండాలి. కృత్రిమ మేఘా లని సృష్టించి కృత్రిమంగా వర్షాలు కురిపించ వచ్చు అదీ చాలా కొద్ది మొత్తంలో మాత్రమే. గతంలో రాజ శేఖర రెడ్డి గారి హయాంలో కృత్రిమ వర్షం కురిపించడానికి వెదర్ రాడార్ [డాప్లర్ రాడార్] లని  నెల కొల్పి ఆకాశం నుండి విమానం ద్వారా సాలిడ్ సిల్వర్ అయోడిన్[సిల్వర్ అయోడిన్ స్ఫటికములు రూపంలో ] మేఘాలలోకి వదులుతారు అలా వదిలిన సిల్వర్ అయోడిన్ స్ఫటికములు మేఘాలలోని తెమని గ్రహించి వాటిని వర్షంలా కురిసెట్లు చేస్తాయి. విమానం ఖర్చు,సిల్వర్ అయోడిన్ ఖర్చు తడిసి మోపడయింది కానీ వర్షాలు పడలేదు అప్పట్లో దాంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలాంటిది దట్టమ యిన మేఘాలని అదీ ఒకే చోట నిలిపి ఉంచి అవి వర్షించేట్లుగా చేయడం అసంభవం. 

గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు ఎక్కడా కూడా ఒకే రకంగా పడలేదు. కుండాపోతాగా అదీ ఒక్క గంటలో 100 మిల్లీ మీటర్ల వర్షం ఎక్కడ పడ్డది ? క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది 2015 లో ముంబై నగరంలో అదీ ఒకే రోజులో 110 మిల్లీ మీటర్ల వర్షం పడ్డది. దాంతో ముంబై నగరం వారం రోజులుపాటు స్తంబించిపోయింది. పల్లపు ప్రాంతాలు 4 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయాయి అదీ వరదనీరు అరేబియా సముద్రం లోకి దారి తీసే డ్రైనేజీ వ్యవస్థ మూసుకు పోవడం ఒక కారణం అయితే సముద్రం నీరు భూమి మీదకి ఎదురు తన్నడం రెండవకారణం నీళ్ళు నిలిచిపోవడానికి. ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 100 లేదా 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు. 

ఇక అమరనాథ్  లో వారం క్రితం వచ్చిన దానిని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. హిమాలయ ప్రాంతాలలో ఇవి సర్వ సాధారణంగా జరిగేదే ! వర్షాకాలం మేఘాలు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే అంతకంటే ఎత్తులో అవి వెళ్లలేవు వాతావారణం చల్లగా ఉండడం వలన మేఘాలు ఎక్కువ ఎత్తులోకి వేళ్ళలేక అక్కడే ఆగిపోయి ఆ మేఘాలు వర్షించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవి వర్షిస్తాయి. అమరనాథ్  ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మంచు కరిగి ఆ నీళ్ళు అక్కడే నిలవ ఉంటాయి వాటికి తోడు పెద్ద వర్షం పడితే ఆ నీరు బురదని తనతో తీసుకొని కిందకి వేగంగా ప్రవహిస్తుంది. ఇది నిత్యం జరిగేదే అక్కడ. డానికి విదేశీ కుట్ర అని ప్రజలకి అర్ధంకాని టెక్నికల్ పదాలని వాడి అయోమయం పడేట్లు చేస్తున్నారు కొందరు.   

ఇక మహారాష్ట్రలోని గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎప్పుడూ లేనిది నాశిక్ పట్టణాన్ని కూడా ముంచేసింది  అయితే వరద  నీరు వెళ్ళే  ప్రాంతాలు  కబ్జాకి గురవడం మూలంగా ఎటూ పోక చివరకి నాశిక్ పట్టణాన్ని ముంచేసి అలాగే దిగువకి ప్రవహించి తెలంగాణ లోని పరీవాహక ప్రాంతాలని ముంచేసింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించలేదు. వారం రోజులుగా ఆగకుండా కురిసిన వర్షాల వల్ల వచ్చిన సమస్య ఇది. 
ఇక మూసీ నది కాచ్మెంట్ ప్రాంతాలలో ఎలాంటి కట్టడాలు కట్టడాన్ని నిషేధించే 111 GO రద్దు చేయడం ఇప్పుడు చర్చకి దారి తీస్తుంది. కాచ్మెంట్ ఏరియాలో కట్టాడాల మీద నిషేధం ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ ప్రాంతాలలో ఇల్లు,అపార్ట్మెంట్ లు కడితే నీళ్ళు ఎక్కడికి పోతాయి ?

కాళేశ్వం పంప్ హౌస్ మునిగిపోయి అందులో ఉన్న హెవీ పంప్ లు చెడిపోవడం వాటిని కాపాడే ఫ్లడ్ వాల్ మూడేళ్ళ కిందటే కూలిపోవడం వలన నీళ్ళు పంప్ హౌస్ లోకి వెళ్ళి పంప్ లు చెడిపోయాయి వాటిని  మళ్ళీ పనిచేయెట్లు చేయాలంటే కానీసం 1000 కోట్లు ఖర్చు అవుతుందేమో ? పంప్ లలోకి బురద వెళ్ళి పోయి నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వాటిని పనిచేయించాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంచేత క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అని విదేశీ కుట్ర అని ఏవేవో చెప్పేస్తే అవి విని నమ్మే వాళ్ళకి కొంచెం ఊరట.

By
en-us Political News

  
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.