జగన్ పాలనపై వైఎస్ ‘ఆత్మ’ ఘోష

Publish Date:Dec 12, 2022

Advertisement

దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఎట్టకేలకు నోరు విప్పారు. అదీ.. తన ప్రాణ స్నేహితుడు వైఎస్సార్ తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనా తీరు పై  వైఎస్‘ఆత్మ’  ఘోష వినిపించింది. దాదాపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత .. అదీ మూడున్నరేళ్ల అనంతరం.... కేవీపీ రామచంద్రరావు ఈ విధంగా స్పందించడం జగన్ పాలనా వైఫల్యానికి అద్దంపడుతోంది.

మూడున్నరేళ్లలో జగన్ పాలన గురించి కానీ, విపక్షాలపై ఆయన సాగించిన అణచివేత గురించి కానీ పన్నెత్తి మాట్లాడని కేవీపీ తాజాగా ఏపీలో జగన్ పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంగతి అటుంచి కనీసం విజ్ణప్తి కూడా చేయకపోవడాన్ని కేవీపీ తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ  విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉందని వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన కేసీపీ... జగన్ కాంగ్రెస్ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని కేవీపీ విమర్శలు లేకపోలేదు. అయితే తాజాగా కేవీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కు సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తర్వాత సీఎంను కలవలేదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించిన సదస్సులో  కేవీుపీ పాల్గొన్నారు.  అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, చివరికి కుటుంబ సభ్యులు ఇలా అందరూ దూరం అవుతున్నా.. కేవీపీ మాత్రం ఇంత వరకూ జగన్ కు తెరవెనుక సహాయం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది.

తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఆయన కూడా జగన్ కు దూరం జరిగారని తేటతెల్లమైపోయింది.  ఏపీ విభజన అంశాలను నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదనీ,  బీజేపీకి దగ్గరై  జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకూ జగన్ బీజేపీకి దగ్గరవ్వడం కాదు.. కేసుల భయంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఏం చెబితే అది చేస్తున్నారనీ ఉన్న విమర్శలకు కేవీపీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కేవీపీ బహిరంగంగా జగన్ పాలనపై విమర్వలు చేయడంతో..ఇప్పుడు అందరి దృష్టీ సూరీడు అనే వ్యక్తిపై పడింది. కేవీపీ వైఎస్ కు ఆత్మ అయితే సూరీడు అనే వ్యక్తి వైఎస్ కు అంగరక్షకుడిగా ఆ రోజుల్లో గుర్తింపు పొందారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమం అయినా వైఎస్ ఎక్కడుంటే అక్కడ సూరీడు ఉండేవాడు. ఇంతకీ సూర్యనారాయణ రెడ్డి అనే సూరీడు కూడా వైఎస్ మరణానంతరం జగన్ పక్కన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

వైఎస్ కు అత్యంత సన్నిహిడుడిగా గుర్తింపు పొందిన సూరీడు ఆయన మరణం తరువాత ఎందుకు జగన్ కు దూరం జరిగారు. కనీసం వైఎస్ వర్దంతి, జయంతి సందర్భాలలో కూడా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఇంత కాలానికి వైఎస్ ‘ఆత్మ’ కేవీపీ బహిరంగంగా జగన్ పాలనను తప్పుపడితే.. జగన్ తీరు, వ్యవహార శైలిని గుర్తించిన సూరీడు వైఎస్ మరణం తరువాత జగన్ కు దూరమయ్యారని నెటిజన్లు అంటున్నారు.       

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.