మళ్లీ పెద్ద నోటు రద్దు

Publish Date:Dec 12, 2022

Advertisement

మళ్లీ నోట్ల రద్దు ప్రకటనకు రంగం సిద్దమవుతోందా? అదీ ముఖ్యంగా రెండు వేల రూపాయిలు.. ఇకపై   ఆదృశ్యం కానుందా?  గతంలో ఐదు వందల రూపాయిలు.., వెయ్యి రూపాయిల నోట్ల రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు మరో సారి నోట్ల రద్దుకు సిద్ధమౌతోందా?   ఈ సారి  రెండు వేల రూపాయిల నోట్లను రద్దు చేయనున్నారా?  ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై  మోదీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందన్న చర్చ   హస్తినలో వాడీ వేడిగా నడుస్తోంది.

 మరోవైపు రాజ్యసభలో సోమవారం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. రెండు వేల రూపాయిల నోటు... బ్లాక్ మనీకి కేరాఫ్ ఆడ్రస్‌గా మారిందని అన్నారు. అలాగే మనీ లాండరింగ్‌కి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు, ఉగ్రవాద మూకలకు నిధులకు..  రెండు వేల రూపాయిల నోట్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వేల రూపాయిల నోట్లను దశల వారీగా రద్దు చేయాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఓ వేళ  రెండు వేల నోట్ల రద్దు చేసేటట్లు అయితే.. వాటిని మార్చుకోనేందుకు దేశ ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఇప్పటికే ఏటీఎంల్లోరెండు వేల రూపాయిల నోట్లు కనిపించడం లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రెండు వేల నోట్లపై ప్రజల్లో ఓ విధమైన ఊహాగానాలు ఊపందుకోన్నాయని.. వీటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత   ప్రభుత్వానిదేనంటూ ఆయనీ సందర్బంగా చెప్పారు.

మరో వైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం.. గత మూడేళ్లు నుంచి అంటే 2019 నుంచి   రెండు వేల రూపాయిల నోట్లు ముద్రణను నిలిపి వేసిందని ఈ సభ సాక్షిగా ఎంపీ సుశీల్ మోదీ గుర్తు చేశారు.

 2016 నవంబర్ 8న దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడం కోసం.. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ క్రమంలో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లను రద్దు చేశారు. కానీ ఆ తర్వాత.. అదే మోదీ ప్రభుత్వం రెండు వేల రూపాయిల నోట్లను   ముద్రించి చెలామణీలోకి తెచ్చింది. దీంతో పెద్ద నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో మరీ పెద్ద నోట్లు పెట్టడం ఏమిటనే విమర్శ అప్పట్లో పెద్దగా వినిపించింది.   ఆ తర్వాత మోదీ ప్రభుత్వం ఏమనుకుందో ఏమో కానీ.. 2019 నుంచి రెండు వేల రూపాయిల నోట్ల ముద్రణను నిలిపివేసింది.

అదీకాక... ఓ వైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో రెండు వేల రూపాయిల నోట్లు నేపాలి మాంత్రికుడు మాయం చేసినట్లు మాయమైపోయాయి. ఎన్నికల వేళ.. ఓటర్ల కోసం వివిధ రాజకీయ పార్టీలు.. ఇప్పటికే రెండు వేల రూపాయిల నోట్లను.. కట్టలుగా పేర్చి  గోదాముల్లో దాచేశాయనే ఓ వదంతి అయితే అటు ప్రజల్లో.... ఇటు నెటిజన్లుల్లో షికారు చేస్తోంది. అలాంటి వేళ.. ఓ వేళ రెండు  వేల నోట్ల రద్దు చేస్తే మాత్రం.. అధికార పార్టీలకే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు సైతం పట్టపగలే చుక్కలు  కనిపిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.