కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు. బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) ఆస్పుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన వారిలో 15 మంది అస్వస్థతకు గురియ్యారు. హెచ్‌ఎంటీ హిల్స్ లోని కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్, గూగుల్ ఫ్లాట్స్ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్, శాతవాహన నగర్ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు.
కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్ గౌడ్, బి. శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి.కుమార్ గౌడ్, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpally-39-201608.html
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై 8న విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.
జపాన్ దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేశారు.
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అంత భారీ మెజారిటీతో గెలిచారంటే అందుకుర ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ చేసిన త్యాగం ఒక ప్రధాన కారణం.
మాజీ మంత్రి హరీశ్ రావు లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.
కూటమి ప్రభుత్వం శుక్రవారంసెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో పని చేసినట్టు విన్నానని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అంతా హరీష్ రావుదేనంటూ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై ఇంత కాలం మౌనం వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందా? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది సిట్ గుర్తించిందా? అంటే సిట్ దూకుడు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ తెలంగాణ సర్కార్ పంపిన లేఖకు స్పందనగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు.
కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఏక కాలంలో కత్తులు దూస్తున్నారు.
సెప్టెంబర్ 18 నుంచి ఏపీ వర్షకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతున్నాయి.