Publish Date:Aug 22, 2025
ఓటీటీలో వచ్చే ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసిన బాలుడు... హత్య కంటే రెండు రోజుల ముందే బాలుడు మిషన్ డన్ పేరుతో ఒక లేఖ రాసుకున్నాడు. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రభావితమయ్యాడు. గ్యాస్ లీక్ చేసి పరార్ అవ్వాలని ప్లాన్ చేశాడు. అదే విషయాన్ని మిషన్ డాన్ పేరుతో వచ్చిరాని ఇంగ్లీషు లో ఒక పేపర్ మీద రాసుకున్నాడు. పథకం ప్రకారం పక్కింట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అంతలో అమ్మాయి కనిపించింది. దీంతో భయపడిపోయిన బాలుడు తన దొంగతనం విషయం బయటపడకుండా ఉండడానికి బాలికను అతి దారుణంగా హత్య చేశాడు.
బాలిక సహస్ర హత్య జరిగిన రోజే పోలీసులు బాలు డిని విచారించారు. అయితే విచారణ చేస్తున్న సమయం లోసహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్లానని పోలీసు లను తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి నాన్న నాన్న అని గట్టి గట్టిగా అరుపులు వినిపించాయని పోలీసులను నమ్మించాడు. బాలుడు చెప్పిన మాటలు నమ్మిన పోలీసులు సహస్రను ఇతరులు చంపి ఉంటారని అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఇలా పోలీసులు గత ఐదు రోజులుగా భవనంలోని ప్రతి ఒక్కరిని విచారించడమే కాకుండా బాలిక తల్లిదండ్రులను కూడా విచారించారు.
ఈ కేసులో ఎస్ఓటి, కూకట్పల్లి పోలీసులు 300 మందిని విచారించారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా కూడా కూకట్పల్లి లో జరిగిన సహస్ర బాలిక హత్య కేసు మిస్టరీ వీడలేదు. ఈరోజు ఉదయం ఎస్వోటీ పోలీసులు మళ్లీ హత్య జరిగిన భవనానికి వెళ్లి ఆధారాలు సేకరి స్తున్న సమయంలో పక్క భవనం నుండి ఈజీగా ఈ బిల్డింగ్ లోకి దూకవచ్చునని గుర్తించారు. దీంతో ఎస్ఓటి పోలీసులు పక్క బిల్డింగ్ లో ఉన్న వారందరిని విచారించారు. అయితే వర్క్ ఫర్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు తన గది పక్కనే ఓ బాలుడు 15 నిమిషాల పాటు దాక్కొని ఉన్నాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు.
పక్క భవనంలోనే ఆ బాలుడు ఉంటాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడికి కోసం వెంటనే స్కూలుకు వెళ్లి స్కూల్లోనే బాలుడిని పక్కకు పిలిచి విచారణ చేశారు. తనకు హత్యకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి బాలుడు పోలీసులను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకు బాలుడి పై అనుమానం వచ్చి అతన్ని తీసుకొని ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీ చేయగా.. కత్తి, రక్తంతో కూడిన దుస్తులు, పక్క ఇంట్లో దోచుకునేందుకు ప్లాన్ వేసిన మిషన్ డౌన్ పేరుతో రాసుకున్న లేఖ లభ్యమైంది.
దీంతో ఎస్ఓటి పోలీసులు వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే బాలుడి కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లోకి వచ్చారు. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతు న్నారు. హత్య చేసిన బాలుడు మరియు మృతు రాలి తమ్ముడు స్నేహితులు.... ఈ క్రమంలోనే మృతు రాలు సహస్ర పుట్టినరోజు వేడుకలకు నిందితుడు హాజరయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpally-39-204818.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.