కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
Publish Date:Aug 22, 2025
Advertisement
సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం... పబ్జి వంటి గేమ్ షోలో గన్ పట్టుకుని ఎదురు వచ్చిన శత్రువులను తుపాకిలతో కాల్చి చంపడం...ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారు తుందనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు... తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలి యగానే పోలీసులు, స్థానికులు ఒక్క సారిగా అవ్వక్క య్యారు. గత ఐదు రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే నిందితుడి గా బయటపడింది. పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీషు లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీషులో ఓ లెటర్ రాసుకున్నాడు. బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సహస్ర అక్కడికి వచ్చింది. దొంగ తనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడులో తెలియని భయం మొదలైంది. అది గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ ఓ టి పోలీసులు బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమి చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీషులో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..
http://www.teluguone.com/news/content/kukatpally-39-204797.html





