కేటీఆర్ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనా..!

Publish Date:Oct 15, 2026

Advertisement

ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?

రాజకీయాల్లో నాయకుల ఆహార్యం, వారి గెటప్ మార్పులు ఎప్పుడూ కార్యకర్తల్లో, ప్రజల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ ఎంతో హుందాగా క్లీన్ షేవ్‌తో కనిపించే ఆయన, ఒక్కసారిగా గడ్డం పెంచి కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న రామగుండంలో నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఆ సమయంలో ఆయనను చూసిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయాల్లో లేదా పాదయాత్రల సమయంలో మాత్రమే తమ రూపంలో మార్పులు చేస్తుంటారు. కానీ కేటీఆర్ ఇలా సడన్‌గా గెటప్ మార్చడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో కరీంనగర్ వద్ద మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సతీశ్ బాబు తదితర ప్రముఖ నేతలు కేటీఆర్‌ను కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నేరుగా విషయానికి వచ్చిన గంగుల కమలాకర్.. "ఏందీ సంగతి.. గడ్డం పెంచినవ్?" అని సరదాగా ప్రశ్నించారు.

దీనికి కేటీఆర్ తనదైన శైలిలో నవ్వుతూ బదులిచ్చారు. "పోయేది గోదావరిఖనికే కదా.. సింగరేణికే కదా! ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడవదు" అంటూ చమత్కరించారు. కార్మిక ప్రాంత పర్యటనకు వెళ్తున్నందువల్లనే ఈ విధంగా విభిన్నమైన శైలిలో సిద్ధమయ్యానని ఆయన వివరించడంతో అక్కడున్న వారంతా పడీపడీ నవ్వుకున్నారు.

ప్రస్తుతం కేటీఆర్‌కు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఈ లుక్‌ను 'మాస్ లుక్' అంటూ అభివర్ణిస్తూ తెగ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ శైలికి ఫిదా అవుతూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు. 'బాస్ ఈజ్ బ్యాక్  ఏ మాస్ లుక్' అంటూ కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ప్రజాక్షేత్రంలో ప్రజల నాడిని పట్టుకోవడంలో, వారి ప్రాంతీయ సంస్కృతికి తగ్గట్టుగా మెలగడంలో నాయకులు ఇలాంటి మార్పులు చేస్తుండటం సర్వసాధారణమే అయినప్పటికీ, కేటీఆర్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా మంచి చర్చకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ కార్యక్రమాలలో ఇదే లుక్‌ను కొనసాగిస్తారా లేదా అనే దానిపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ విప్‌ బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు  కేటీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో రహస్యంగా హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నారని, ఇందుకోసం లండన్‌ నుంచి ప్రత్యేక వైద్యుడిని పిలిపించి రూ.5 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేటీఆర్‌కు జ్వరం వచ్చిందని, తనను ఎవరూ కలవకూడదంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు సందేశాలు పంపారని బల్మూర్ వెంకట్‌ పేర్కొన్నారు. హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ తర్వాత ముఖం వాచిపోవడంతోనే ఆయన బయటకు రావడం లేదని ఆరోపించారు.

కేటీఆర్‌కు నిజంగానే జ్వరం వస్తే సోషల్‌ మీడియా లైవ్‌లోకి వచ్చి తన పరిస్థితిని వెల్లడించాలని బల్మూర్ వెంకట్‌ సవాల్‌ విసిరారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కాగా, కేటీఆర్‌ హెయిర్‌ ట్రీట్‌మెంట్‌, రూ.5 కోట్ల ఖర్చు వంటి అంశాలపై బల్మూర్ వెంకట్‌ చేసిన ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు వెల్లడికావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై కేటీఆర్‌ లేదా బీఆర్‌ఎస్‌ వర్గాల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.

 

 

 

[ KTR new beard look, KTR Singareni tour, BRS Working President KTR,  KTR mass look, Telangana political news, Singareni Karmika Garjana, BRS Party, Telangana politics, MLC Balmoor Venkat, CM Revanth reddy ]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.