సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్.!

Publish Date:Oct 14, 2026

Advertisement

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల పోరాట స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమంలో వారు పోషించిన కీలక పాత్రను కొనియాడారు. కార్మికుల చెమట చుక్కలతో దేశం వెలుగులతో నిండుతోందని వ్యాఖ్యానించారు.బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తమ ఉద్యమ స్ఫూర్తిని చాటారని గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపుతో కోల్‌బెల్ట్ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందిందని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి సహకారంతో తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును గతంలో ఆంధ్ర ప్రాంతానికి తరలించారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంతానికి తరలించారని విమర్శించారు.

సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సంస్థను ప్రైవేటీకరణ నుంచి రక్షించేందుకు కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ప్రజలు మోసపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని కేసీఆర్ గతంలోనే హెచ్చరించారని గుర్తుచేశారు. ఉత్పత్తిలోనూ, ఉద్యమాల్లోనూ సింగరేణి కార్మికులు ముందుంటారని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

 

 

 

[ KTR, KTR Speech, Singareni Workers, Singareni Karmika Garjana, Singareni Workers Protest, Singareni Privatization, Revanth Reddy, Telangana Politics, BRS Party, BRS Working President KTR, Godavarikhani, Peddapalli News, Singareni Coal Mines, Telangana Movement, KCR, Congress Government Telangana ]


 

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.