ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కర్త, కర్మ, క్రియ కేటీఆర్?

Publish Date:Oct 28, 2022

Advertisement

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ బూమరాంగ్ అయ్యిందా? ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల  ఎపిసోడ్ వికటించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కనుగోలు బేరసారాల ఎపిసోడ్ వెనుక ఉన్న వ్యూహ కర్త కేసీఆర్ కాదనీ, ఇదంతా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కనుసన్నలలో జరిగిందనీ అంటున్నారు. అందుకే పైకి ప్రణాళిక పక్కాగా ఉన్నట్లు కనిపించినా, చివరికి తుస్సు మని ఎదురు పార్టీ ప్రతిష్టే మసకబారే ముప్పు తెచ్చిందనీ చెబుతున్నారు.

అసలీ ఎపిసోడ్ మొత్తం అనుమానాల మయంగా, సందేహాల పుట్టగా ఉంది. సమాధానం దొరకని ప్రశ్నలెన్నో టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఒక వేళ ఇదే ఆపరేషన్ కేసీఆర్ ప్లాన్ చేసి ఉంటే.. బీజేపీ నాడు రేవంత్ ఇరుక్కున్న విధంగానే చిక్కుకుని ఉండేదని పరిశీలకులు అంటున్నారు. అయితే అత్యుత్సాహంతో కేటీఆర్ తన కనుసన్నలలో కేసీఆర్ కు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆరంభించడం వల్లనే విఫలమైందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాలన్న ఏకైక లక్ష్యంతో చేపట్టిన ఈ వ్యూహంలో టీఆర్ఎస్ విఫలమై నిండా మునిగిందని కూడా అంటున్నారు.  దీంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.

కేటీఆర్, కొనుగోలు వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రగతి భవన్ లో గట్టిగా క్లాస్ పీకారని అంటున్నారు. ఆ క్లాస్ తరువాతనే కేటీఆర్ ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరూ స్పందించ వద్దంటూ పార్టీ నాయకులు, క్యాడర్ కు పిలుపు నిచ్చారంటున్నారు. దీనిని ఇంకా మోస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్.. ఆదేశాల మేరకే గురువారం ఉవ్వెత్తున ఎగసిన టీఆర్ఎస్ ఆందోళనలు అదే రోజున చప్పున చల్లారిపోయాయని అంటున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహాలు రచించాలన్న కేసీఆర్ ఒకే ఒక్క సూచనతో కేటీఆర్ ముందు వెనుకలాలోచించకుండా  ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ట్రాప్ డ్రామాకు తెరతీశారనీ, ఈ విషయంలో నాడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఏ వ్యూహం అవలంబించారో అదే వ్యూహాన్ని అంతే పక్కాగా ప్లాన్ చేశారనీ పరిశీలకులు అంటున్నారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఎక్కడొచ్చిందంటే.. ఫామ్ హౌస్ లో డ్రామా అంతా రక్తికట్టినా డబ్బులు అక్కడ లేకపోవడం బెడిసికొట్టిందన్నారు. కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ కు తరలిస్తే ఈడీ రంగంలోకి దిగుతుందనీ, ఈడీ రంగంలోకి దిగితే కేసు తెలంగాణ పోలీసుల చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో డబ్బు చుట్టూనే డ్రామా నడిచినా ఆ డబ్బును ఫిజికల్ గా అక్కడకు చేర్చలేదని అంటున్నారు. అలాగే ఫామ్ హౌస్ నుంచి కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ఫోన్ వెళ్లినా.. ఆ ఫోన్ ను స్వయంగా అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ కేసులో బీజేపీని బలంగా ఇరికించే ప్రయత్నం ఫలించలేదంటున్నారు. ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేయలని భావించడం, ఇందుకు సంప్రదింపులు చేయడం అంతా వాస్తవమేనని అనుకున్నా.. దానిని ససాక్ష్యంగా బయటపెట్టే విషయంలో తెరాస విఫలమైందని అంటున్నారు.

ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే బీజేపీని ఇరికించే బలమైన ఆధారాలున్నాయని ప్రజలను నమ్మించే యత్నాలలో భాగమే... గురువారం (అక్టోబర్ 27) ఉదయం నుంచీ కేసీఆర్ మీడియాతో మాట్లాడతారంటూ మీడియాకు సమాచారం ఇవ్వడం.. సాయంత్రమయ్యే సరికి ఇక్కడ కాదు.. హస్తినలో కేసీఆర్ బీజేపీ గుట్టు రట్టు చేస్తారంటూ మాటమార్చడం వంటి వ్యూహాలను టీఆర్ఎస్ అమలు చేస్తున్నదని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ హస్తిన పర్యటన ఖరారు కాలేదు. ఈ వ్యవహారం కోసమే అయితే కేసీఆర్ ఢిల్లీ వేళ్లే అవకాశమే లేదు.  

ఇక బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడం కోసం నియోగించిన నందకుమార్‌, ,సతీష్‌శర్మ  అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులు విషయానికి వస్తే.. వీరిలో నంద కిషోర్ కు బీజేపీ, తెరాస నేతలతో సంబంధాలు ఉన్నాయి. పాన్ షాప్ నిర్వాహకుడిగా ఆరంభమై ప్రస్తుతం హైదరాబాద్ లోని పోష్ ప్రాంతంలో ఖరీదైన బార్ అండ్ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ఇక రామచంద్రభారతి విషయానికి వస్తే ఆయనకు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆయన బీజేపీ తరఫున ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వచ్చారని నిర్ధారించలేం. ఇక మూడో వ్యక్తి తిరుపతి సమీపంలోని చిన్నమండెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆశ్రమం ఉన్నప్పటికీ ఏ రోజు భుక్తి ఆ రోజే అన్న పరిస్థితి ఆయనది. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు. కుమారుడు మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తి తనకు, తన కుమార్తెకు, కుమారుడికి  హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లు కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ తరఫున దూతలుగా, ప్రతినిథులుగా వ్యవహరించారంటే నమ్మశక్యంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయినా మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ గ్రామాల వారీగా ఎమ్మెల్యేలు, నాయకులకు ఇన్ చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. అనుక్షణం ఏ గ్రామంలో ప్రచారం తీరు ఎలా ఉందన్న సంగతిని కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. వారితో కేటీఆర్ నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఈ పరిస్థితిలో కేటీఆర్ కు తెలియకుండా వారు నియోజకవర్గం వదిలి హైదరాబాద్ కు వచ్చే అవకాశమే లేదు.   అందుకే ఇదంతా కేటీఆర్ కనుసన్నలలోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.