నోరు జారి జగన్ కేసులో ఇర్రుకొన్న కేంద్ర మంత్రి

Publish Date:Apr 30, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కాంగ్రెస్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్యన ఉన్న ఒక అస్పష్టమయిన సన్నటి గీతను కూడా చేరిపివేస్తోంది. అతని కేసులతో విడదీయలేనంతగా ముడిపడిపోయిన మంత్రులు తమ తప్పులను ఒప్పుకొనలేక, వాటి నుండి తప్పుకొనలేక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వంలో బాద్యతగల మంత్రులుగా వారు తీసుకొన్న నిర్ణయాలకు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని ఏవిధంగా బాధ్యుని చేస్తారంటూ జగన్ తరపు లాయర్లు వేస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సరయిన సమాధానం లేకపోవడంతో, వారు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైపు చూ(పి)స్తున్నారు.

 

ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఉలికులికిపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన పార్టీని బౌతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయసాగారు. కొందరు అతనినిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు అతను శాశ్వితంగా జైలలోనే ఉండిపోతాడని జోస్యం చెప్పుతున్నారు.

 

ఆ ఊపులోనే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు.

 

కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొని, మొన్న సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషను మీద వాదనలు జరుగుతున్నప్పుడు కోర్టులో బయటపెట్టి, “జగన్ మోహన్ రెడ్డి అరెస్టులో తమకి ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరిప్పుడు అతను పార్టీలో చేరితే జైలు నుండి బయటపడతాడని ఏవిధంగా హామీ ఇస్తోంది? అంటే జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర చేస్తే దానికి సీబీఐ పరోక్షంగా సహకరిస్తోందని భావించాలా? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకొంటే సీబీఐ అతని మీద పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోతాయా?” అని ప్రశ్నించేసరికి సీబీఐ వద్ద చెప్పేందుకు సమాధానం లేదు.

 

ఒక పక్క తాము జగన్ మోహన్ రెడ్డి కేసులలో నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిళ్ళు లేకుండా దర్యాప్తు జరుపుతున్నామని, తమది స్వతంత్ర సంస్థ అని సీబీఐ పదేపదే ప్రకటించుకొంటుంటే మరో వైపు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అతను కేసుల నుండి, జైలు నుండి విడుదల హామీలు గుప్పించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. ఇక చేసేదేమీ లేక ఆవిధంగా హామీ ఇచ్చిన సదరు మంత్రి గారికి కూడా సమన్లు జారీ చేసి, ఆయన ఏవిధంగా జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విడిపిస్తారో తెలుసుకోవాలనుకొంటున్నట్లు కోర్టుకు విన్నవించుకొని బయట పడింది.

 

ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలందరి నోళ్ళు మూతపడే అవకాశం ఉంది. లేకుంటే వారు కూడా కోట్ల లాగే కోర్టు మెట్లక్కక తప్పదు.

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.