ఔను నిజమే.. విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టారు.. కన్ ఫర్మ్ చేసిన కోటంరెడ్డి.!

Publish Date:Sep 1, 2026

Advertisement

వైసీపీ అంతర్గత వ్యవహారాలు, అగ్రనేతల మధ్య విభేదాలను  తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు.   గతంలో వైసిపి ప్లీనరీ సమావేశాల వేదికగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి మధ్య జరిగిన గొడవలు వాస్తవమేనంటూ సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి నాడు మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సందర్భంగా వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 2022 లో మంగళగిరి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీలో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు.  

 ప్లీనరీ సమావేశాల విశ్రాంతి గదిలో  సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టారని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు విజయసాయిరెడ్డిపై ఎలాంటి ప్రేమా లేదంటూ.. అక్కడ  నిజంగా ఏంజరిగిందో  ప్రజలకు తెలియాలనే ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని  పేర్కొన్నారు.  సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసిన విషయం పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్న ఆయన..  వైసీపీ అధినేత జగన్ కు కూడా  ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసన్నారు.  

అప్పట్లో విజయసాయి, సజ్జల మధ్య నడిచిన  ఆధిపత్య పోరుకు సంబంధించి రానున్న రోజులలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఇక వైసిపి నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ..  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కూడా జగన్ మోహన్ రెడ్డే  అంటూ ఆ క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేశారు.  

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ..  అక్టోబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవు తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నిధులు తీసుకురావాలన్నసంకల్పంతో ఉన్నారనీ, వైసీపీయులే..   ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుపడు తున్నారని విమర్శించారు. విశాఖపట్నం తరహాలోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కేసులోనూ కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. 


[Kotamreddy Sridhar Reddy confirms vijaya sai allegation, Sajjala Ramakrishna Reddy Beat vijayasai, YCP Plenary Clashes, AP Politics, Telugu One]

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.