కొరియా పిల్లాడి నోట జనగణమన!
Publish Date:Sep 1, 2022
Advertisement
ఉయ్యాల్లో పిల్లకి జోలపాడుతుంది తల్లి. తల్లి పాటలు పాడుతూనే బువ్వాపెడుతుంది, బడికీ పంపు తుంది. అలా వినీ వినీ పిల్లా ఏదో కూనిరాగాలాలపిస్తుంటుంది. అది గొప్ప పాటా కాకపోవచ్చు, గొంతు లతాదీ కాకపోవచ్చు. కానీ అలా కూనిరాగాలతో రోజు గడిపేయడం అదో సరదా. టెన్షన్ తగ్గుతుందన్నది చాలా మంది మాట. క్రమేపీ పాట సినిమా పాటే అవుతోంది. ఈరోజుల్లో అంతా ఫాస్ట్‌బీట్. రాగం పట్టడానికి పెద్ద కష్టాపడక్కర్లేదు. కానీ జాతీయగీతాలు అలాకాదు. ఎన్నితరాలయినా, ఎంతకాలమయినా అది అలాగే పాడాలి. అదే శృతిలో, అదే లయలో పాడాలి. ఎవరి జాతీయగీతం వారికి గొప్ప. భారతీయులం దరికీ జనగణమన వచ్చి తీరుతుంది. కాకుంటే, సైన్యంలో ఉన్నవారు రోజూ తప్పకుండా పాడుకుం టారు, వింటారు. సామాన్య జనులు ఆగష్టు 15, జనవరి 26 తప్ప మరేరోజూ జాతీయగీతం తలవనైనా తలవరు. అసలు పిల్లలకు దేశభక్తి ఉండి తీరాలన్న రూలు ఎవరూ పనిగట్టుకుని బోధించే యత్నం చేయరు. అది స్వతహాగానే ఉంటుంది. ఎవరి తల్లి వారికి గొప్ప అలాగే దేశమూ! ఇటీవల బీజేపీ ప్రభుత్వం పనిగట్టు కుని ప్రజలకు మనం భారతీయులం గనుక పతాకాన్ని, జాతీయగీతాన్ని రోజూ గుర్తుచేసుకోవాలన్న భారీ ప్రచారంతో దేశభక్తిని రాజకీయ లబ్ధికి బాగా ఉపయోగించుకుంటోంది. పిల్లలకు, యువతకు జాతీయ గీతం కంటే సినిమాపాటలే తేలిగ్గా ఇష్టం, నేర్చుకుంటున్నారు. పాటల పోటీలు అవే జరుగుతున్నాయి. చిత్రమేమంటే విదేశీయులకు మన భాషలు, మన జాతీయగీతం మీద మక్కువ పెరిగింది. ఆమధ్య ఒక కొరియా మహిళ హిందీ నేర్చుకుంది, మరో మహిళ పకోడీ చేయ డం నేర్చుకుంది. ఇపుడు ఇంకో మహిళ తన పిల్లాడికి ఏకంగా భారత్ జాతీయ గీతం నేర్పించడంలో తలమునకలయింది! విదేశీ పర్యాటకులకు తాము వెళ్లిన దేశాల్లో తమకు బాగా నచ్చినవి, తమను ఎంతో ఆకట్టుకున్న అంశా లను మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు డైరీ రాస్తారు, కొందరు ఆయా ప్రాంతాల గురించి వ్యాసాలు రాస్తారు, నేర్చుకున్న పాటో, పద్యమో మళ్లీ నేర్చుకుని పిల్లలకూ నేర్పుతారు. వారికి అదో సరదా. దీనికి భారత్ అంటే అపారమయిన అభిమానం ఉందని కాదు. కొన్ని వినసొంపుగా ఉండ డం వల్ల సంగీతజ్ఞానం సహజంగా ఉన్నవారికి ఇలాంటివి మనసును హత్తుకుంటాయి. అందువల్ల ఎంతో ఇష్టపడతారు. దీనికి దేశీయులు, విదేశీయులన్న తేడా లేదు. తెలుగు ఇష్ఠపడే గుజరాతీయులు, గుజరా తీని ఇష్టపడే బెంగాలీలు ఉన్నట్టే మన జాతీయగీతాన్ని ఇష్టపడే విదేశీయులు కూడా చాలా మందే ఉన్నారు. కిమ్ అనే కొరియా మహిళ తన పిల్లాడు ఆదికి జనగణమన నేర్పించి వాడితో కలిసి పాడుతూ వీడయో రిలీజ్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కిమ్ భర్త భారతీయుడు. అందువల్ల భారత్ గురించిన సర్వవిశేషాలు ఆమెకి తెలిసే ఉంటుంది. వారికి ఆ దృష్టి ఉంటుంది. మనకి గుజరాత్ గురించి తెలియకపోవచ్చుగానీ, విదేశీయులకు మాత్రం భారత్ గురించిన ప్రత్యేక విశేషాలన్నీ తెలుసు కునే ఆసక్తి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/korea-child-learns-janaganamana-25-143055.html





