కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పులిదిండిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పడవ పోటీలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా నిర్వహించిన ట్రయల్ రన్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన పొరపాటున కాలువలో పడిపోయారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే స్పందించి కలెక్టర్‌ను రక్షించారు. ఆయనను సురక్షితంగా వేరే పడవలోకి ఎక్కించారు.
జీపుతో సహా సముద్రంలోకి.. యువకుడి మృతి
అదలా ఉంటే కోనసీమ జిల్లాలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అపశ్రుతి చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరు యువకులు మద్యం సేవించి జీపులో సముద్రంలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి అంతర్వేది బీచ్ కు గురువారం ముగ్గరు యువకులు వచ్చారు. అంతర్వేదిలోని ఓ రిసార్ట్ లో రూమ్ తీసుకుని పార్టీ చేసుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో వారిలో ఇద్దరు యువకులు తమ వాహనంలో బీచ్ రోడ్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి, అన్నాచెల్లెలు గట్టు వద్ద మలుపును గమనించకుండా సముద్రంలోకి వెళ్లిపోయారు. చివరి నిముషంలో జీపులో ఉన్న ఇద్దరిలో ఒకరు బయటకు దూకేసి సురక్షితంగా బయటపడగా, మరో యువకుడు జీపుతో సహా సముద్రంలో గల్లంతయ్యాడు. తరువాత అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని శ్రీధర్ గా గుర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konaseema-collector-escaped-accident-36-211896.html
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు.
35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో ఈ ఉదయం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.
తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు.
ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి.
సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు మినహాయింపునిచ్చారు.