జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్సుఖ్నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/job-calendar-36-212183.html
కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యంగ్ ఇండియా స్కూల్ లో బ్రేక్‌ఫాస్ట్ అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-11 పరిధి ఉదయ్‌నగర్ బస్తీలో ఇసుక టిప్పర్ నాళాలో బోల్తా పడింది.
మాజీ సీఎం కేసీఆర్‌ను మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు
పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.