చంద్ర‌బాబు మాస్టార్ ప్లాన్‌.. తిరువూరు అసెంబ్లీ బ‌రిలో ఫైర్‌ బ్రాండ్‌ కొలికిపూడి

Publish Date:Feb 2, 2024

Advertisement

ఏపీలో ఎన్నిక‌ల వేడి తారస్థాయికి చేరింది.  మ‌రో మూడునాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార వైసీపీ, తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మరో చాన్స్ కోసం నేల విడిచి సాము చేస్తున్నారు. ఈక్ర‌మంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు చెక్‌పెడుతూ కొత్త‌గా ఇంచార్జిల‌ను నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే ఐదు ద‌పాలుగా విడుద‌లైన జాబితాల్లో  60 నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ అభ్య‌ర్థుల‌కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న, ఫైర్ బ్రాండ్ గా పేరుగడించిన కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను బ‌రిలోకి దింపాల‌ని చంద్ర‌బాబు నిర్ణయించారు. వైసీపీలో టికెట్ ద‌క్క‌ని తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి తెలుగుదేశంలోకి వ‌స్తారని, తిరువూరు నుంచి తులుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారని స్థానికంగా చ‌ర్చ‌జ‌రుగుతున్నది. అయితే  చంద్ర‌బాబు మాత్రం కొలిక‌పూడి శ్రీ‌నివాస్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. 

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ఇటీవ‌లే వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించిన నాలుగో జాబితాలో తిరువూరు అసెంబ్లీ ఇంచార్జిగా న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ పేరును ఉంది. దీంతో తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా స్వామిదాస్ బ‌రిలో నిల‌వ‌డం దాదాపు ఖ‌రారైంది. స్వామిదాస్ కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రి పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కొలిక‌పూడి శ్రీ‌నివాస్ ను తిరువూరు నుంచి బ‌రిలో దింప‌డ‌మే స‌రైంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవ‌లే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం సీటును ఆయ‌న ఆశిస్తున్న‌ప్ప‌టికీ.. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం అయితేనే విజ‌యావ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీ‌నివాస్ భార్య ఎస్టీ  కావ‌డంతో ద‌ళితులు, గిరిజ‌నుల ఓట్లే ల‌క్ష్యంగా కొలిక‌పూడి పేరును తెలుగుదేశం అధిష్టానం తెర‌పైకి తెచ్చింది.

 అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు ఛాన‌ళ్లలో డిబేట్ ల‌లోనూ కొలిక‌పూడి త‌న వాగ్దాటితో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తుంటాడు. ముఖ్యంగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో పదునైన మాట‌ల‌తో ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌ట్ట‌డం,  ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన‌డంతోపాటు ఉమ్మ‌డి గుంటూరు స‌హా కృష్ణా జిల్లాలోనూ ప్ర‌జ‌ల్లో  శ్రీ‌నివాస్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు అరెస్టై జైలుకెళ్లిన స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి వారిని చైత‌న్య‌ ప‌రిచి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా అక్క‌డి ఆందోళ‌న‌లకు కొలిక‌పూడి శ్రీ‌నివాస్ నేతృత్వం వ‌హించారు. అన్ని అంశాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కోగ‌ల స‌త్తాఉన్న కొలిక‌పూడిని ఎలాగైనా అసెంబ్లీలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో తిరువూరు నుంచి కొలిక‌పూడి శ్రీ‌నివాస్ పేరును చంద్ర‌బాబు  దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వు అయిన తిరువూరులో ఎస్సీ సామాజిక వ‌ర్గ ఓట్ల‌తో పాటు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లుకూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ క్ర‌మంలో శ్రీ‌నివాస్ ఎస్సీ సామాజిక వ‌ర్గం వ్య‌క్తి కావ‌డం, అత‌ని భార్య ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన  వ్య‌క్తికావ‌డంతో రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లూ ప్రభావితమౌతాయని   టీడీపీ అధిష్టానం భావిస్తున్నద‌ని స‌మాచార‌. తిరువూరుతో పాటు మైల‌వ‌రంలో ఉన్న ప‌లు తండాల్లో కూడా కొలిక‌పూడి శ్రీనివాస్ స‌తీమ‌ణితో ప్ర‌చారం చేయించ‌డం ద్వారా మంచి  మైలేజ్ వ‌స్తుంద‌ని తెలుగుదేశం భావిస్తోంది. అమ‌రావ‌తి ఉద్య‌మంలో కొలిక‌పూడి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లుకూడా ఎక్కువ‌గా ఆద‌రిస్తార‌ని, త‌ద్వారా వైసీపీని తిరువూరులో వైసీపీని మ‌ట్టిక‌రిపించాలంటే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ క‌రెక్ట్ క్యాండెంట్ అని చంద్రబాబు భావిస్తున్నారు. కొలిక‌పూడి   తిరువూరు నుంచి బ‌రిలోకి దిగితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.