Publish Date:Nov 20, 2025
అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బేంగళూరు నుంచి బుధవారం (నవంబర్ 18) తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు చేరుకున్నారు. గురువారం (నవంబర్ 19)న ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సరే అదలా ఉంచితే.. బుధవారం నవంబర్ 18) తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉండి.. గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరువాత సైలెంటైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిశారు.
వీరితో పాటు ఇప్పుడు పార్టీలో వాయిస్ వినిపిస్తున్న ఏకైక నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నలుగురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా కాలం తరువాత ఇదే తొలిసారి. కాగా జగన్ ను కలిసిన ముగ్గురు నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలలో పేర్ని నానిలో భౌతికంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నానిల అపియరెన్స్ లో మాత్రం చాలా చాలా మార్పు కనిపించింది. కొడాలి నాని బరువు తగ్గిపోయి.. మనిషి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినట్లు కనిపించారు. వల్లభనేని పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ అందగాడు అంటు జగన్ గతంలో అభివర్ణించిన వల్లభనేని వంశీలో ఇప్పుడు ఆ చార్మ్ కానీ, ఉత్సాహం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. నెరిసిపోయిన జుట్టు, గుబురుగడ్డంతో వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురూ అంటే కొడాలి, పేర్ని నాని ద్వయం, వల్లభనేని వంశీ అధికార గర్వంతో విర్రవీగుతో.. ప్రత్యర్థులపై ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకునే వారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే అనుచిత భాషా ప్రావీణ్య ప్రదర్శనలో డాక్టరేట్ పొందారా అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత వారిలో ఆ దూకుడు, దురుసుతనం పూర్తిగా కనమరుగైపోయి మన్నుతిన్న పాములా అన్నట్లుగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodalinani-and-vallabaneni-vamshi-appearence-changed-completely-39-209822.html
Publish Date:Mar 12, 2026
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.