Publish Date:Jan 16, 2022
అదో కన్వెన్షన్. పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరిగే ఫంక్షన్ హాల్. మామూలుగా అయితే ఇంతే. కానీ, అది వైసీపీ నేత, మంత్రి కొడాలి నానికి చెందిందైతే అంత రొటీన్‌గా ఎందుకుంటుంది. కొడాలి నోరులానే.. గుడివాడ కె కన్వెన్షన్‌ను గబ్బు గబ్బు చేసేశారు. గుడివాడకు గోవా కల్చర్‌ను తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్బంగా.. మందు, చిందు, జూదంతో రచ్చ రంబోలా చేస్తున్నారని అంటున్నారు.
అసలే అధికార పార్టీ నేత. అందులోనూ మంత్రి. ఇక అటువైపు చూసే అధికారులు ఎవరు? అందుకే, యథేచ్చగా కన్వెన్షన్ సెంటర్‌ను జూదశాలగా మార్చేశారు. వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, మూడు ముక్కలాట, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా.. సంక్రాంతి స్పెషల్‌గా ప్రత్యేకంగా గోవా స్టైల్ క్యాసినో కూడా ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి.
కె కన్వెన్షన్ లోపలంతా అదో టైప్ సెటప్. స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్. చిట్టిపొట్టి డ్రెస్సులతో చీర్ అప్. స్పెషల్ లైటింగ్స్‌తో స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా సాంగ్స్‌కు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. క్యాసినో లోపల సెల్ ఫోన్లు నిషేధం. బౌన్సర్లతో టైట్ సెక్యూరిటీ. సంక్రాంతి సెలబ్రేషన్స్ పేరుతో గుడివాడ కె కన్వెన్షన్‌లో గోవా క్యాషినోలు, పేకాట క్లబ్‌లు, బోగంమేళాలు నడుపుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-convention-as-sankranti-club-39-130250.html
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.