అబ్బ...ఆయనే గుర్తొస్తున్నారు..

Publish Date:Nov 3, 2014

Advertisement

 

ఈ మధ్యన ఏమిటో తరచూ ఆయనే అందరి కలల్లోకి వస్తున్నారుట! ఆయన అనగానే స్వర్గీయ యన్టీఆరో..లేక స్వర్గీయ రాజశేఖ రెడ్డో అనుకొనేరు...రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ పోరాడిన వ్యక్తి. అలాగని జగన్మోహన్ రెడ్డి అనుకొనేరు...స్మీ! చివరి దాక రాష్ట్ర విభజనని, ఆ నిర్ణయం తీసుకొన్న తన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన వ్యక్తి...మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తరచుగా అందరి కలల్లోకి వస్తున్నట్లు తెగ ప్రచారం అవుతోంది.

 

ఆనాడు రాష్ట్ర విభజన చేస్తే నీళ్ళ కోసం కరెంటు కోసం గొడవలొస్తాయని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ ఆయన మాటేవరూ చెవికెక్కించుకోలేదు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందని అరిచి గ్గీ పెట్టారు, కానీ ఆయనే పార్టీకి ఎసరు పెట్టేలా ఉన్నారని సాటి కాంగ్రెస్ జీవులన్నీ అప్పుడు చెవులు కొరుకొన్నాయి. ఆయన వేరు కుంపటి పెట్టుకొని బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనిక మళ్ళీ పార్టీలోకి తిరిగి రాడనీ రూడీ చేసుకొన్నాక, ఆ చెవులు కొరుకొన్న కాంగ్రెస్ జీవులన్నీ దైర్యంగా ఇంటి కప్పుపైకి ఎక్కి మరీ జనాల చెవులు చిల్లులు పడేలా ఆయనే పార్టీకి ఎసరు పెట్టారు అని తెగేసి ప్రకటించేశారు. కానీ జనాలు మాత్రం వాళ్ళ మాటలసలు నమ్మలేదు, కానీ జనాలే కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెట్టేసారు. కాంగ్రెస్ పార్టీకే కాదు చెప్పులరిగిపోయేలా తిరిగినా పాపం ఆయన చెప్పుల పార్టీకి కూడా ఒక్కసీటు రాలేదు. పాపం అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లయింది ఆయన పరిస్థితి. రాష్ట్రానికి, తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకి ఎంచక్కగా జోస్యం చెప్పిన ఆయన కనబడకుండా పోయాడు.

 

కానీ జనాలు మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన జోస్యం గుర్తు తెచ్చుకొంటూ ఆకులు పట్టుకొంటున్నారు. అయితే జనాలెవరూ కూడా ఆయనలాగే జోస్యం చెప్పి, విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడి చివరికి దేశాటన కూడా చేసి వచ్చిన మరో పెద్దమనిషి జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిధంగా ఎప్పుడు అనుకోకపోవడం ఏమిటో..అస్సలు అర్ధం కావడం లేదు. ఒకానొకప్పుడు సమైక్య ఛాంపియన్ రేసులో ఇద్దరూ సరి సమానంగానే పరిగెత్తారు. ఇద్దరూ కూడా ఒక్కలాగే జోస్యం చెప్పారు. కానీ జనాలు ఆయనని తలచుకొని ఈయనగారిని మరిచిపోవడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏమంటే ఆయన ముందే ప్రామిస్ చేసినట్లు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు కనుక ఆయనొక గొప్ప త్యాగమూర్తని...ఈయనగారు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జనాలకి కుచ్చు టోపీ పెట్టిన వాడని...లక్షా తొంబై కారణాలు చెప్పవచ్చు గాక, కానీ అంతమాత్రాన్న క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయడం ఏ మాత్రం భావ్యం కాదు.

 

నిజానికి పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనే సంగతి గ్రహించకుండా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి నచ్చచెప్పాలని చూడటం మొదటి తప్పు. ఒకపక్క అధిష్టానానికి వద్దు వద్దు అని చెపుతూనే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకొని కూర్చొవడం మరో తప్పు. కూర్చొని మళ్ళీ అదే అధిష్టానానికి రాష్ట్ర విభజనకి ‘ఫుల్ కోపరేషన్’ ఇవ్వడం ఇంకో తప్పు. కోపరేషన్ చేస్తూనే చేయడం లేదని బుకాయించడం మరో తప్పు. సమయం కాని సమయంలో వేరు కుంపటి పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. ఒక పక్క రాష్ట్రం విడిపోతుంటే సమైక్యాంధ్ర పార్టీ అని పేరు పెట్టుకోవడం ఇంకో తప్పు.

 

ఇన్ని తప్పులు చేసి, కేవలం స్వీయ తప్పిదాల కారణంగానే కనబడకుండాపోయిన ఆయనను జనాలు తలుచుకొంటున్నారే గానీ కంటికెదురుగా తిరుగుతున్న చెట్టంత మనిషిని పట్టించుకోక పోవడం చాలా దారుణం. ఇంతకీ ఆయనగారి గొప్పదనం ఏమిటి ఈయనగారు చేసిన నేరం ఏమిటి?ఈ జనాల తీరు చూస్తే కడుపు రగిలిపోతోంది...విశ్వసనీయతే లేదు వీళ్ళకి... 

By
en-us Political News

  
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.