తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?

Publish Date:Jun 14, 2026

Advertisement

 

దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి  824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. 

తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. దాంతో ఏపీలో 25 ఎంపీ సీట్లు నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లను 3గా, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది.

ఆ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన రిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నష్టం, అధికార కూటమికి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే పట్టణ ప్రాంతాలు.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో బీజేపీ లబ్ది పొందే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009 ఎన్నికల ముందు జరిగిన డిలిమిటేషన్ సమయంలో కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. అనేక పాత నియోజకవర్గాలు రద్దయి, కొత్తవి ఏర్పడ్డాయి. 

ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ఆధారంగా చాలా జనరల్ స్థానాలు రిజర్వ్‌డ్ స్థానాలుగా మారాయి. అది కలిసి వచ్చి ఏపీలో కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆ లెక్కలతోనే ఈ సారి నియోజకవర్గాల పెంపుతో ఎన్డీఏ కూటమికి ప్లస్ అవుతుందన్న విశ్లేషణలున్నాయి. అయితే ఏపీలో నియోజకవర్గాలపై ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదికతో వైసీపీకి లబ్ది చేకూరే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల పెంపునకు పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభాతో పాటు భాషా సమీకరణాలు, గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. 

ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. వీటిలో రాజంపేట, కడప మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం కూటమి ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  అంటే ఈ 7 లోక్‌సభ స్థానాలను విడగొట్టి 20 చేయాలి. ఆ పెరిగే స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ నియోకవర్గాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశముంది. 

గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 4 ఎంపీ స్థానాల్లో అరకు ఎస్టీ, తిరుపతి ఎస్సీ రిజర్వ్‌డ్ కావడం గమనార్హం. నియోజకవర్గాల పెంపుతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆర్థిక సలహా మండలి సూచిస్తోంది. గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పరిమితమైన వైసీపీ దాదాపు 40 శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, సహజంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే వైసీపీ ఓటు షేరు ఎంతోకొంత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో వైసీపీ బలం పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. 
ఇటు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఓటర్ల బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే. 

అంతో ఇంతో విద్యావంతులే మోడీ చరిష్మాకు ఆకర్షితులవుతున్నారు. ఆ బలంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ తెలంగాణలో ఏకంగా 8 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. ఇక ఇఫ్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ , చేవెళ్ల లోక్‌సభ స్థానాలను విడగొట్టి 14 స్థానాలు చేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. వాటిలో హైదరాబాద్ మినహా మిగిలిన నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలే గెలిచారు. 

ఇక ముందు నుంచి కాషాయపార్టీకి కొరకరాని కొయ్యగా మారిన హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సారి హైదరాబాద్‌ను మూడు లోక్‌సభ స్థానాలుగా మారిస్తే ఎంఐఎంను పరిమిత ప్రాంతానికి కట్టడి చేసి, బీజేపీ బలం పెంచుకునే అవకాశముందంటున్నారు. మరి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఎంత వరకు అమల్లోకి వస్తాయో? నియోజకవర్గాల పెంపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఏ రేంజ్లో ప్రభావితం చేస్తాయో? ఖచ్చితంగా తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

By
en-us Political News

  
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.